నేడు ఢిల్లీకి టి.కాంగ్రెస్ మాదిగ సామాజికవర్గ ఎమ్మెల్యేలు!

by Ajay Maddhiboyina |

తెలంగాణ కాంగ్రెస్ మాదిగ సమాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. కేబినెట్‌ విస్తరణలో తమకు ప్రాధాన్యత ఇవ్వాలని

నేడు ఢిల్లీకి టి.కాంగ్రెస్ మాదిగ సామాజికవర్గ ఎమ్మెల్యేలు!
X

దిశ‌, వెబ్ డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ మాదిగ సమాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. కేబినెట్‌ విస్తరణలో తమకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరేందుకు ఎమ్మెల్యేలు నేడు ఖర్గేతో భేటీ అవ్వనున్నారు. ఇక నిన్న మాదిగసామాజికవర్గానికి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు మందుల సామేలు, కాలే యాదయ్య, అడ్లూరి లక్ష్మణ్, కవ్వంపల్లి సత్యనారాయణ, లక్ష్మీకాంతారావు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ను కలిసి ఆమెకు వినతీపత్రం అందజేశారు.

తమ సామాజికవర్గం వాళ్లు రాష్ట్రంలో 30 లక్షల మంది ఉన్నారని, వారంతా కాంగ్రెస్‌ పార్టీకి ఎన్నికల్లో సపోర్ట్ చేశారని తెలిపారు. అయినప్పటికీ మంత్రివర్గంలో తమకు స్థానం దక్కలేదన్నారు. త్వరలో జరిగే మంత్రివర్గవిస్తరణలో తమలో ఒకరికి అవకాశం కల్పించాలని కోరారు. దీంతో ఆమె పెద్దలతో మాట్లాడి న్యాయం చేసే విధంగా కృషి చేస్తాన‌ని హామీ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. ఇక నేడు ఖ‌ర్గేను సైతం క‌లిసి ఎమ్మెల్యేలు ఇదే విష‌యానికి సంబంధించి మాట్లాడ‌నున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి హామీ ఇస్తారన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

Next Story