టీజేఎస్ ఆఫీస్‌కు రేవంత్ రెడ్డి.. కోదండరామ్‌కు కాంగ్రెస్ కీలక ఆఫర్..?

by Disha Web Desk 19 |
టీజేఎస్ ఆఫీస్‌కు రేవంత్ రెడ్డి.. కోదండరామ్‌కు కాంగ్రెస్ కీలక ఆఫర్..?
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీతో తెలంగాణ జనసమితి పొత్తు వ్యవహారం తుది దశకు వచ్చినట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో కలిసి నడిచే విషయంలో గత కొంత కాలంగా ఇరు పార్టీల ముఖ్య నేతలు చర్చలు కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో కోదండరామ్ పార్టీ విషయంలో నేరుగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రంగంలోకి దిగబోతున్నారు. ఈ మేరకు ఇవాళ టీజేఎస్ ఆఫీస్‌కు రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్‌తో రేవంత్ రెడ్డి సమావేశం అయి ఇరు పార్టీల మధ్య తుది ప్రతిపాదనలపై చర్చించే అవకాశాలు ఉన్నాయి.

అయితే పొత్తు పెట్టుకునేందుకు తమకు నాలుగు స్థానాలు ఇవ్వాలని టీజేఎస్ కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు, సీట్ల సర్దుబాటు విషయంలో తలెత్తుతున్న సమస్యలను ఇవాళ్టి భేటీలో రేవంత్ రెడ్డి టీజేఎస్ అధినేతకు వివరించబోతున్నట్లు తెలుస్తోంది. టికెట్ల విషయంలో వెనక్కి తగ్గాలని, ప్రభుత్వం వచ్చాక పార్టీ కోదండరాంకి సముచిత గౌరవం ఇస్తామని ఒప్పించే అవకాశాలున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

Next Story

Most Viewed