- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు బల్కంపేట్ ఎల్లమ్మ కల్యాణోత్సవం.. పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రులు
నగరంలోని మహిమాన్విత బల్కంపేట్ ఎల్లమ్మ (Balkampet Yellamma) కల్యాణోత్సవ క్రతువును ఇవాళ అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: నగరంలోని మహిమాన్విత బల్కంపేట్ ఎల్లమ్మ (Balkampet Yellamma) కల్యాణోత్సవ క్రతువును ఇవాళ అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే, మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా సోమవారం మొదటి రోజు అమ్మ వారిని పెళ్లి కూతురుగా ఆలయ అర్చకులు ముస్తాబు చేశారు. పుట్ట మన్ను తీసుకొచ్చి SR నగర్ వేంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ఎల్లమ్మ ఆలయం వరకు ఊరేగింపుతో ఎదురుకోళ్ల ఉత్సవాన్ని నిర్వహించారు. ఇవాళ ఉదయం 9 గంటలకు బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ క్రతువు ప్రారంభం కానుంది. ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha), మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) సమర్పించనున్నారు.
అదేవిధంగా ఈనెల 10న సాయంత్రం 6 గంటలకు రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించానున్నారు. అమ్మవారి కళ్యాణోత్సవానికి నగరం నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలిరానున్నారు. ఈ నేపథ్యంలోనే ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ (Hyderbad) ప్రధాన మార్గాల నుంచి అమ్మవారి ఆలయానికి 80 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడపనుంది. బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు వీక్షించేలా సమాచార శాఖ ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు చేసింది. ఆసక్తి గల భక్తులు https://youtube.com/live/b2ynYRwggGc లింక్ ఓపెన్ చేసి అమ్మవారి కళ్యాణాన్ని ప్రత్యక్షంగా చూడవచ్చు.






