- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు అత్యంత కీలకం.. ఒకేసారి ఆ ఆరుగురి విచారణ!
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణను సిట్ వేగవంతం చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణను సిట్ వేగవంతం చేసింది. నేడు ఆరుగురు నిందితులను కలిపి విచారించే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. రెండు రోజులుగా ఫోన్ ట్యాపింగ్ బాధితులు సిట్ కార్యాలయంలో వాగ్మూలం ఇస్తున్నారు. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సైతం జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి వాంగ్మూలం ఇచ్చారు. అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఇప్పటికే మూడు సార్లు ఎస్ఐబీ మాజీ చీఫ్ సిట్ విచారణకు హాజరయ్యారు. మంగళవారం కూడా రావాల్సి ఉన్నా.. హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో బుధవారం విచారణకు రావాలని సిట్ అధికారులు ఆదేశించారు. అయితే ప్రభాకర్ రావుతోపాటు నిందితులుగా ఉన్న రాధాకిషన్ రావు, భుజంగ రావు, తిరుపతన్న, ప్రణీత్ రావు, శ్రవణ్ లను హజరు కావాలని సిట్ అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో నేడు ఆరుగురిని కలిపి విచారించే అవకాశమున్నట్లు తెలుస్తున్నది.
నేడు సిట్ ముందుకు బీజేపీ నేతలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో వాంగ్మూం ఇచ్చేందుకు రావాలని ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, బీజేపి ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డిలకు సిట్ అధికారులు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో నేడు వారంతా సిట్ కు వాంగ్మూల్ ఇచ్చే అవకాశముంది. 2023 నవంబర్ 15 నుంచి బీజేపి నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు సిట్ అధికారులు ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. బీజేపీ నేతలు, వారి ముఖ్య అనుచరులు, కుటుంబ సభ్యుల ఫోన్లు సైతం ట్యాప్ చేసినట్లు గుర్తించినట్లు సమాచారం.






