నేడు జాతీయ చేనేత దినోత్సవం.. నేతన్నలకు సీఎం రేవంత్ స్పెషల్ విషెస్

by Kema Shiva Kumar |

భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి సింబల్‌గా నిలిచే చేనేతకు గుర్తుగా దేశ వ్యాప్తంగా ప్రతి ఏడాది ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని (National Handloom Day) నిర్వహిస్తారు.

నేడు జాతీయ చేనేత దినోత్సవం.. నేతన్నలకు సీఎం రేవంత్ స్పెషల్ విషెస్
X

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి సింబల్‌గా నిలిచే చేనేతకు గుర్తుగా దేశ వ్యాప్తంగా ప్రతి ఏడాది ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని (National Handloom Day) నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే నేషనల్ హ్యాండ్ల్యూమ్ డే సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేత కార్మికులకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. మానవ నాగరికత ప్రగతిలో చేనేతకు విశిష్టమైన స్థానం ఉందని అన్నారు. ప్రజా ప్రభుత్వం చేనేత పునరుజ్జీవం కోసం, చేనేత కార్మిక కుటుంబాల సంక్షేమం కోసం పని చేస్తోందని తెలిపారు. చేనేత కార్మికుల పాత బకాయిలు విడుదల చేయడంతో పాటు, రూ.లక్ష వరకు ఉన్న రుణాలు మాఫీ చేశామని గుర్తు చేశారు. నేత కార్మికుల స‌మ‌గ్రాభివృద్ధికి తెలంగాణ (Telangana) చేనేత అభ‌య‌ హ‌స్తం ప‌థ‌కం, తెలంగాణ నేత‌న్న పొదుపు, నేత‌న్న బీమా, తెలంగాణ నేతన్నకు భ‌రోసా వంటి వినూత్న కార్యక్రమాలు ప్రజా‌ప్రభుత్వం అమలు చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Next Story