- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు మాజీ మంత్రి కేటీఆర్ బర్త్ డే.. ఎమ్మెల్సీ కవిత ఇంట్రెస్టింగ్ ట్వీట్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) జన్మదినం సందర్భంగా గులాబీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా అప్ప్పడే సెలబ్రేషన్స్ మొదలు పెట్టేశాయి.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) జన్మదినం సందర్భంగా గులాబీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడే సెలబ్రేషన్స్ మొదలు పెట్టేశాయి. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేటీఆర్ ఇంటికి స్వయంగా వెళ్లి బర్త్ డే విషెస్ చెబుతుండగా.. కొందరు సోషల్ మీడియా (Social Media) వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ కవిత, కేసీఆర్ (KCR)కు రాసిన లేఖ బయటకు రావడంతో బీఆర్ఎస్ (BRS) పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. కేసీఆర్ దేవుడని.. ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని, పార్టీలో కొవర్టులదే రాజ్యమంటూ కవిత కామెంట్ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ వ్యాఖ్యలు ‘కేటీఆర్ అండ్ కో’ని ఉద్దేశించి చేశారనే వార్తలు సోషల్ మీడియాతో, పార్టీలో శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ పరిణామంతో అప్పటి నుంచి కవిత, కేటీఆర్ మధ్య గ్యాప్ వచ్చింది. అయితే, ఇవాళ అన్న కేటీఆర్ పుట్టిన రోజు కావడంతో ఎమ్మెల్సీ కవిత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. ‘అన్నయ్య.. మెనీ మోర్ హ్యాపీ రిటర్స్న్ ఆఫ్ ది డే’ అంటూ కవిత సింపుల్‌గా బర్త్ డే విషెస్ చెప్పారు.






