'నేడు దేశ చరిత్రలో దుర్దినం'

by Disha Web Desk 4 |
నేడు దేశ చరిత్రలో దుర్దినం
X

దిశ, అచ్చంపేట : మహాత్మా గాంధీ జనవరి 30న ప్రార్థనకు వెళ్తుండగా హత్య చేయబడ్డారని ఈ రోజు దేశ చరిత్రలో దుర్దినమని రాష్ట్ర ఏ‌ఐసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి అన్నారు. అచ్చంపేటలో ఆయన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ, రాష్ట్ర ఇన్ ఛార్జి మాణిక్ రావు ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సూచనలతో నేడు దేవాలయాలు, మసీదులు, ప్రార్థన మందిరాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ఏ విధంగా మభ్యపెట్టి మోసం చేస్తున్నాయనే విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు.

కేంద్ర విధానాలను ఎండగడుతూ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కన్యా కుమారి నుండి కశ్మీర్ వరకు 4,008 కిలోమీటర్లకు చేరుకుందన్నారు. ఈ సందర్భంగా నేడు ముగింపు సభ పెద్ద ఎత్తున జరుగుతోందన్నారు. యాత్రకు అనుసంధానంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో హాత్ సే హాత్ జోడో పేరుతో గడపగడపకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తీసుకెళ్తామన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ.. జిల్లాలో కల్వకుర్తి, నాగర్ కర్నూల్, కొల్లాపూర్ నియోజక వర్గాలలో హాత్ సే హాత్ జోడో కార్యక్రమం నేటి నుండి ప్రారంభం అవుతుందన్నారు. అచ్చంపేటలో ఈ నెల 26 నుండి కొనసాగుతుందని తెలిపారు.

ఇవి కూడా చదవండి: రాహుల్ గాంధీ ముగింపు సభకు మంచు ఎఫెక్ట్!


Next Story

Most Viewed