- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ చరిత్రలో ఈరోజు మైలురాయి : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
తెలంగాణ విముక్తి దినోత్సవం సందర్భంగా నల్గొండలో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ చరిత్రలో ఈ రోజు మైలురాయిగా నిలిచిపోయిందన్నారు.

తెలంగాణ చరిత్రలో ఈరోజు మైలురాయి : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
- నల్లగొండ జిల్లా పోరాటాలకు నిలువెత్తు సాక్ష్యం
- ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం
దిశ, నల్లగొండ: తెలంగాణ విముక్తి దినోత్సవం సందర్భంగా నల్గొండలో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ చరిత్రలో ఈ రోజు మైలురాయిగా నిలిచిపోయిందన్నారు. నిజాం నిరంకుశ పాలనను ముగించి, ఆపరేషన్ పోలో ద్వారా తెలంగాణ భారత యూనియన్లో విలీనం అయి 77 ఏళ్లు పూర్తయ్యాయని గుర్తుచేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అమరులైన త్యాగధనులకు, ఉద్యమకారులకు జోహార్లు అర్పించారు. నల్లగొండ జిల్లా పోరాటాలకు నిలువెత్తు సాక్ష్యమని, అనేక త్యాగాలు ఈ నేల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని చెప్పారు. మొదటి దశ ఉద్యమం నుంచి మలిదశ ఉద్యమం వరకు నల్లగొండ యువత, విద్యార్థులు, ఉద్యోగులు కీలకపాత్ర పోషించారని మంత్రి పేర్కొన్నారు .ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుతో హ్యాండ్‌లూమ్ ఇనిస్టిట్యూట్, గద్దర్ పేరుతో సినీ అవార్డులు, ‘జయ జయ హే తెలంగాణ’ను రాష్ట్ర గీతంగా ప్రకటించడం వంటి పలు నిర్ణయాలు తీసుకున్నామని గుర్తు చేశారు.
రాష్ట్రంలో ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, గృహజ్యోతి, రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్ల పథకం, 10 లక్షల ఆరోగ్యశ్రీ పరిమితి వంటి పథకాలు అమలు అవుతున్నాయని వివరించారు.నల్లగొండలోనే అత్యధికంగా 2.33 లక్షల మంది రైతులకు రూ.2044 కోట్లు రుణమాఫీ చేశామని, SLBC టన్నెల్ పనులు 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. AMRP కాలువ లైనింగ్ పనులకు రూ.442 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.మహాత్మా గాంధీ యూనివర్సిటీని బలోపేతం చేస్తామని, న్యాయశాస్త్రం, బి.ఫార్మసీ కళాశాలలు ప్రారంభమవనున్నాయని తెలిపారు. నర్సింగ్ కళాశాల, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటులో ఉన్నాయని చెప్పారు.రహదారుల అభివృద్ధికి 868 కోట్ల నిధులు కేంద్రం మంజూరు చేయడం సంతోషకరమని, నల్లగొండ బైపాస్ రోడ్డు, డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్, RRR వంటి ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతున్నాయని చెప్పారు.ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్, ప్రజా ప్రతినిధులు, అధికారులు, పాత్రికేయులు,ఉద్యమకారులు పాల్గొన్నారు






