- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ రోజు మునుగోడు కు నా సద్ది నేనే తెచ్చుకుంటున్న: RSP
మునుగోడు ఉప ఎన్నికకు బీఎస్పీ చీప్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సన్నద్ధం అవుతున్నారు. మునుగోడులో దళితుల శక్తి ఏంటో తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు తెలిసేలా చేయాలని ఆర్ఎస్‌పీ యోచిస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: మునుగోడు ఉప ఎన్నికకు బీఎస్పీ చీప్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సన్నద్ధం అవుతున్నారు. మునుగోడులో దళితుల శక్తి ఏంటో తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు తెలిసేలా చేయాలని ఆర్ఎస్‌పీ యోచిస్తున్నారు. ఇందులో భాగంగా నేడు మునుగోడులో తన రెండో విడత బహుజన రాజ్యాధికార యాత్ర ను మునుగోడు నుంచి ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ట్విట్టర్ వేదికగా ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఈ యాత్రకు తన సద్దిని తానే ఇంటి వద్ద నుంచి తెచ్చుకుంటున్నట్లు తెలిపారు. అలాగే "దోపిడీ TRS, BJP, Cong ల లాగా దావత్‌లు ఇవ్వడానికి మన వెనక బడా పారిశ్రామికవేత్తలు ఎవరూ లేరు. మన వనరులు మనమే సమకూర్చుకోవాలి. మన ఆకలి దప్పిక మనమే తీర్చుకోవాలి. ఇట్లయితేనే దొరల గడీల పాలనను అంతమొందించగలం. ఛలో మునుగోడు.✊#BahujanaYatra #BSP అని RS Praveen kumar ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి : మునుగోడుపై BSP ఫోకస్.. భారీ వ్యూహంతో నేటినుంచి రంగంలోకి RSP






