- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో 7వ మైలు వద్ద ఆంజనేయస్వామి విగ్రహం మాయం
తిరుమలలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మొదటి ఘాట్ రోడ్డులోని 7వ మైలు వద్ద ఆంజనేయస్వామి విగ్రం మాయమైంది. నిత్యపూజలు అందుకునే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దుండగులు దొంగలించారు.

దిశ, వెబ్ డెస్క్: తిరుమలలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మొదటి ఘాట్ రోడ్డులోని 7వ మైలు వద్ద ఆంజనేయస్వామి విగ్రం మాయమైంది. నిత్యపూజలు అందుకునే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దుండగులు దొంగలించారు. విగ్రహం మాయమైన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. కాషాయ దుస్తుల్లో వచ్చిన ఓ వ్యక్తి విగ్రహాన్ని ఎత్తుకెళ్లినట్టు వీడియోలో కనిపిస్తోంది. కాషాయ గుడ్డలో చుట్టి విగ్రహాన్ని దాచి పెడుతూ తీసుకువెళ్లినట్టు కనిపిస్తోంది. పవిత్ర పుణ్యక్షేత్రంలో విగ్రహం మాయం అవ్వడంపై భక్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఆలయం వద్దకు వచ్చిన భక్తులు విగ్రహం లేకపోవడంతో అక్కడే బొట్టుపెట్టుకుని, దండం పెట్టుకుని వెళ్లిపోతున్నారు. అయితే తిరుమల లాంటి ఆలయంలో విగ్రహం చోరీకి గురవ్వడంతో భద్రతా వ్యవస్థపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే దీనిపై ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగి సీసీటీవీ ఫుటేజ్ సేకరించారు. ప్రస్తుతం ఆ వీడియోల ఆధారంగానే విచారణ జరుపుతున్నారు.






