వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి గుడి ప్రాంతంలో మూసి ఉన్న దుకాణంలో దొంగల దోపిడీ

by Kodari Anjali |

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ప్రాంతంలో దొంగలు పడ్డారు.

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి గుడి ప్రాంతంలో మూసి ఉన్న దుకాణంలో దొంగల దోపిడీ
X

దిశ, వేములవాడ టౌన్: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ప్రాంతంలో దొంగలు పడ్డారు. ఆషాడ మాసం కావడంతో మూసి ఉన్న దుకాణాలను టార్గెట్ చేసి దాదాపు 6 దుకాణాల్లో చోరీ చేయడమే కాకుండా, సిలిండర్లు స్టౌలు ఉన్న దుకాణాల్లో ఏకంగా వంట చేసుకుని తిని, రాత్రంతా దొంగతనాలకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలో ఆషాడమాసం భక్తుల రద్దీ తక్కువగా ఉండడంతో జాతర గ్రౌండ్‌లో మూసి ఉన్న దుకాణాల్లో దొంగలు దోపిడీకి పాల్పడ్డమే కాకుండా, నిత్యవసర సరుకులతో వంట చేసుకుని నింపాదిగా దొంగతనం చేసిన ఆనవాళ్లు కనిపించాయి. ఒక్కో షాపులో దాదాపు 20 నుండి 50 వేల వరకు నగదు, సామాన్లను ఎత్తుకెళ్లారు. నగదుతో పాటు గాజులు, ఫర్నిచర్ సామాను తదితర సామాన్లను దోచుకున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు ఉదయం షాపు తెరవడంతో దుకాణాల్లో సామాన్లు చిందర వందరగా పడి ఉండడంతో యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, దాదాపు 6 దుకాణాల్లో చోరీ జరిగినట్లు గుర్తించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story