నేడే గద్దర్ అవార్డుల ప్రదానం..హైటెక్స్‌లో భారీ ఏర్పాట్లు

by Ajay Maddhiboyina |

తెలంగాణ ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మకంగా నిర్వ‌హిస్తున్న గ‌ద్ద‌ర్ అవార్డుల ప్ర‌దానోత్స‌వం నేడు హైటెక్స్‌లో అంగరంగ వైభవంగా జరగనుంది.

నేడే గద్దర్ అవార్డుల ప్రదానం..హైటెక్స్‌లో భారీ ఏర్పాట్లు
X

దిశ‌, వెబ్ డెస్క్: తెలంగాణ ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మకంగా నిర్వ‌హిస్తున్న గ‌ద్ద‌ర్ అవార్డుల ప్ర‌దానోత్స‌వం నేడు హైటెక్స్‌లో అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ కార్యకమాన్ని ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ చలనచిత్ర అభివృద్ధి సంస్థ అన్ని ఏర్పాట్ల‌ను చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర‌వాత చిల‌న‌చిత్రాల‌కు అవార్డులు ఇవ్వ‌లేదు. దీంతో 2013 నుండి 2023 వ‌ర‌కు ఉత్త‌మ చిత్రాల‌కు అవార్డులు ఇవ్వ‌నున్నారు. అంతే కాకుండా 2024 నుండి వ‌చ్చిన సినిమాల‌కు అన్ని కేట‌గిరీల‌లో అవార్డులు ప్రదానం చేయ‌నున్నారు. సాయంత్రం 6 గంట‌ల‌కు ఈ కార్య‌క్ర‌మం ప్రారంభం కానుంది. కాగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క మ‌రియు సినీ రాజ‌కీయ ప్ర‌ముఖులు పాల్గొననున్నారు. ఇక గ‌ద్ద‌ర్ అవార్డుల కార్య‌క్ర‌మంపై శుక్ర‌వారం సీఎస్ రామ‌కృష్ణారావు అధికారుల‌తో స‌మావేశం అయ్యారు. పూర్తి ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశించారు.

Next Story