- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొత్తదారిలో కల్తీ కల్లు దందా..ఆ ప్యాకెట్ల రూపంలో కల్లు ప్యాకెట్లు
ఇటీవల హైదరాబాద్‌లో కల్తీ కల్లు కొందరి ప్రాణాలు తీసిన సంగతి తెలిసిందే. కూకట్ పల్లిలోని ఓ కల్లు కంపౌండ్‌లో కల్లు తాగినవాళ్లంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల హైదరాబాద్‌లో కల్తీ కల్లు కొందరి ప్రాణాలు తీసిన సంగతి తెలిసిందే. కూకట్ పల్లిలోని ఓ కల్లు కంపౌండ్‌లో కల్లు తాగినవాళ్లంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాళ్లను ఆస్పత్రికి తరలించగా ఇప్పటి వరకు అందులో పది మంది చనిపోయారు. మరో 34 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో ఎక్సైజ్ శాఖ నిద్రలేచింది. కల్లు కంపౌండ్‌లపై మెరుపు దాడులు చేసింది.
తనిఖీల్లో చాలా కల్లు దుకాణాలలో కల్తీ కల్లును విక్రయిస్తున్నట్టు గుర్తించి కొన్నింటిని సీజ్ చేసింది. ఈ క్రమంలో కల్తీ కల్లు దందా కొత్త దారిలో సాగుతోంది. తాజాగా మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లిలో కల్తీ కల్లు ప్యాకెట్లు బయటపడ్డాయి. కల్లును పాల ప్యాకెట్ల మాదిరిగా ప్యాకింగ్ చేసి విక్రయిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఎస్వీఎస్ బ్రాండ్ పేరుతో కల్లు ప్యాకెట్లను విక్రయిస్తున్నారు. ఈ కేసులో శంకర్ గౌడ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతడివద్ద నుండి భారీగా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.






