- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tirumala: భక్తులతో కిక్కిరిసిన తిరుమల.. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
by Kema Shiva Kumar |
ఆపద మొక్కులవాడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో భక్తులు కిక్కిరిపోయారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆపద మొక్కులవాడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో భక్తులు కిక్కిరిపోయారు. మరోవైపు కార్తీక మాసం కావడంతో భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. శనివారం స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తుల దర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి (Special Darshan) టోకెన్ తీసుకున్న వారికి కేవలం 3 గంటల్లో శ్రీవారి దర్శనం అవుతోంది. ఇక ఆదివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ (Vaikuntam Que Complex)లోని 21 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. శుక్రవారం స్వామి వారిని 82,010 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ (Srivari Hundi) ఆదాయం రూ.3.58 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు (TTD Offcials) తెలిపారు.
Next Story






