చేవెళ్ళ బస్సు ప్రమాదం... ప్రధాన నిందితుడిగా టిప్పర్ ఓనర్

by Muthe.Rajitha |

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో నవంబర్‌ 3న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కీలక ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.

చేవెళ్ళ బస్సు ప్రమాదం... ప్రధాన నిందితుడిగా టిప్పర్ ఓనర్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో నవంబర్‌ 3న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కీలక ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. తాండూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సును రాంగ్‌ రూట్‌లో అతి వేగంతో వచ్చిన కంకర లోడ్ టిప్పర్ బలంగా ఢీకొట్టిన ఘటనలో 18 మంది బస్సు ప్రయాణికులు, టిప్పర్ డ్రైవర్‌తో కలిపి మొత్తం 19 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి ఓవర్‌లోడ్‌, అతి వేగమే ప్రధాన కారణమని దర్యాప్తులో తేల్చిన పోలీసులు, టిప్పర్ యజమాని లచ్చు నాయక్‌ ను ప్రధాన నిందితుడిగా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. ప్రమాద సమయంలో డ్రైవర్‌ పక్కన టిప్పర్‌లోనే ఉన్న లచ్చు నాయక్‌ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

అయితే వాహనాన్ని అధిక లోడుతో నడిపించేందుకు అనుమతి ఇవ్వడంతోనే ఈ ప్రమాదం జరగగా ఆయన్నే ప్రధాన నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు తెలిపారు. తొలుత టిప్పర్ డ్రైవర్ ఆకాష్ కాంబ్లేపై కేసు నమోదు చేసినప్పటికీ, దర్యాప్తులో ప్రమాదానికి కారణం యజమానే అని తేలడంతో చేవెళ్ల పోలీసులు విచారణను మరింత వేగవంతం చేసారు.

Next Story