ఈసారి గంటన్నరలోనే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు పూర్తి.. సీఎం ఆదేశాలు

by Prasad Jukanti |   (  Updated:2026-05-30 12:30:45  IST  )

జూన్ 2న పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే రాష్ట్ర అవతరణ ఉత్సవాలను గంటన్నరలోనే పూర్తి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.

ఈసారి గంటన్నరలోనే రాష్ట్ర ఆవిర్భావ  వేడుకలు పూర్తి.. సీఎం ఆదేశాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఈసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను (Telangana Formation Day 2026) ఉదయం పూటనే నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. జూన్ 2న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర అవతరణ ఉత్సవాలను ఉదయం 8.30 గంటలకే ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

గంటన్నరలోనే వేడుకలు పూర్తి:

ఉదయం 8.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఉత్సవాల్లో జాతీయ పతాకావిష్కరణతో పాటు అన్ని రకాల అధికారిక అవతరణ కార్యక్రమాలను కేవలం గంటన్నర వ్యవధిలోనే (ఉదయం 10 గంటల కల్లా) పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఎండలు ముదరక ముందే వేడుకలను ముగించడం ద్వారా ఎవరికీ ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్స్ వేడుకలకు హాజరయ్యే అతిథులకు, ప్రజలకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

Next Story