- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మైదానంలో పాక్ ప్లేయర్‌లు రెచ్చగొట్టారు’.. తిలక్ వర్మ కీలక వ్యాఖ్యలు
ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ(Tilak Varma) అద్భుతంగా రాణించి జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. అయితే.. మంగళవారం హైదరాబాద్‌లోని లింగంపల్లిలో తాను శిక్షణ పొందిన లెగాల క్రికెట్ అకాడమీ(Legala Cricket Academy)లో తిలక్ వర్మ సందడి చేశారు. అనంతరం అక్కడే మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిలక్ వర్మ మాట్లాడారు. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ విజయాన్ని భారత జవాన్లకు అంకితం ఇచ్చినట్లు తెలిపారు. మైదానంలో పాకిస్తాన్ ప్లేయర్లు అనేకసార్లు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.. మాకు చాలా కోపం వచ్చింది.. కానీ కళ్ల ముందు దేశం కనిపించింది.. అందుకే ఓపికగా ఆడాము.. దాంతో పాటు అప్పటికే మూడు కీలకమైన వికెట్లు కూడా పడ్డాయి.. దాంతో నా మీద మరింత బాధ్యత పెరిగింది అనిపించింది.. కసిగా ఆడి జట్టుకు విజయాన్ని అందించాం.. అందరం సమిష్టిగా రాణించామని తిలక్ వర్మ అన్నారు. ఈ మ్యాచ్ విజయం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు. విజయంలో తల్లిదండ్రులు, కోచ్‌దే కీలక పాత్ర అని అన్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ ప్లేయర్లలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు.






