- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tiger attack: పులితో రీల్స్.. థాయిలాండ్ లో ఇండియన్ పై టైగర్ దాడి
థాయిలాండ్ లో ఇండియన్ టూరిస్టుపై పెద్దపులి దాడి చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: రీల్స్ పిచ్చిలో పడి చాలా మంది ప్రాణాలు పొగొట్టుకుంటున్నా వాటిని చూసి మిగతా వారు బుద్ధి తెచ్చుకోవడం లేదు. వెర్రి చేష్టలతో తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటూనే ఉన్నారు. తాజాగా పెద్దపులితో రీల్స్ కు ప్రయత్నించిన చేసిన వ్యక్తిపై ఆ పులి దాడి (Tiger attack) చేసింది. చనువు ఇచ్చాను కదా అని రెచ్చిపోతావా అన్నట్లుగా సదరు టూరిస్టూపై ఒక్కసారిగా ఎటాక్ చేసింది. ఈ ఘటన థాయిలాండ్ లో (Thailand) జరగగా ఇందుకు సంబధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. థాయిలాండ్ లోని జూపార్కులో పులులను పట్టుకుని నడిచేందుకు అనుమతి ఇస్తారు. ఆ దేశానికి వెళ్లిన ఓ ఇండియన్ టూరిస్టు (Indian tourist) తాను పెద్దపులితో నడవాలని ఆశపడ్డాడు. దీంతో జూ పార్క్ సిబ్బంది సహాయంతో పులిని పట్టుకుని ఠీవీగా నడుచుకుంటూ ముందుకు కదిలాడు. అంతవరకు బాగానే ఉన్నా కొంత దూరం వచ్చాక పులి పక్కనే కూర్చుని దానిపై చేయి వేసి ఫోటో కోసం ప్రయత్నించాడు. దాంతో అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆ పులికి చిర్రెత్తుకొచ్చింది. దాంతో ఉన్నట్టుండి ఆ టూరిస్టుపై దాడి చేసింది. పులి దాడికి దిగబోతున్నదని గ్రహించిన జూ సిబ్బంది తన చేతిలో ఉన్న చిన్న కర్రతో పులిని అదుపు చేసే ప్రయత్నం చేసినా అది ఆగలేదు. ఈ ఘటనలో సదరు టూరిస్టు స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది.






