ప్రయాణికులకు TGSRTC బ్యాడ్ న్యూస్.. సంక్రాంతికి భారీగా పెరగనున్న టికెట్ ధరలు

by Ajay Maddhiboyina |

సంక్రాంతి సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్‌తో పాటు ఓ బ్యాడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో 6431 ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు ప్రకటన విడుదల చేసింది.

ప్రయాణికులకు TGSRTC బ్యాడ్ న్యూస్.. సంక్రాంతికి భారీగా పెరగనున్న టికెట్ ధరలు
X

దిశ, వెబ్ డెస్క్: సంక్రాంతి సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్‌తో పాటు ఓ బ్యాడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో 6431 ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 9,10,12,13 తేదీల్లో స్పెషల్ బస్సులు నడపాలని సంస్థ నిర్ణయించింది. అదే విధంగా 18,19 తేదీల్లో ప్రయాణికుల తిరుగు ప్రయాణం సందర్భంగా ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నట్టు పేర్కొంది. హైదరాబాద్ లోని ప్రధాన రద్దీ ప్రాంతాలైన ఉప్పల్, ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్బీనగర్, మియాపూర్, కేపీహెచ్‌బీ తదితర ప్రాంతాల నుండి స్పెషల్ బస్సులు నడవనున్నట్టు పేర్కొంది. మరోవైపు పండుగ సందర్భంగా టికెట్ ధరలు సైతం పెంచుతున్నట్టు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం టికెట్ ధరలు 1:5 వ‌ర‌కు స‌వ‌రించిన‌ట్టు స్ప‌ష్టం చేసింది. అంతేకాకుండా మ‌హాల‌క్షి ప‌థ‌కంలో భాగంగా మ‌హిళ‌లు ప‌ల్లెవెలుగు, సిటీ ఎక్స్ ప్రెస్, ఆర్డిన‌రీ, మెట్రో బ‌స్సుల్లో ఉచితంగానే ప్ర‌యాణించ‌వ‌చ్చ‌ని స్ప‌ష్టం చేసింది.

Next Story