టికెట్ ధరల పెంపు రూల్స్ చేంజ్.. సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-13 09:21:07  IST  )

సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్టే విధించింది.

టికెట్ ధరల పెంపు రూల్స్ చేంజ్.. సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ ధరల పెంపుపై నెలకొన్న సందిగ్ధతకు సుప్రీంకోర్టు (Supreme Court)లో ఊరట లభించింది. టికెట్ ధరల పెంపు విషయంలో గతంలో తెలంగాణ హైకోర్టు (Telanagana High Court) ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు స్టే ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే, సినిమా టికెట్ రేట్లు పెంచుకోవాలంటే, సదరు చిత్రం విడుదలకు కనీసం 90 రోజుల ముందే ప్రభుత్వం జీవో (GO) జారీ చేయాలని తెలంగాణ హైకోర్టు గతంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నిర్ణయం వల్ల పెద్ద సినిమాల విడుదలకు, వాటి బడ్జెట్ రికవరీకి ఇబ్బందులు తలెత్తుతాయని చిత్ర పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేసింది.

సుప్రీంకోర్టులో పిటిషన్..

హైకోర్టు ఇచ్చిన ఈ 90 రోజుల నిబంధనను సవాల్ చేస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ మహేశ్వరి (Justice Maheshwari), జస్టిస్ ఏఎస్ చంద్రశేఖర్‌ (AS Chandrashekar)లతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధిస్తూ.. టికెట్ ధరల పెంపు విషయంలో ఇప్పటి వరకు అనుసరిస్తున్న పాత విధానాన్నే పాటించాలని స్పష్టం చేసింది. తాజాగా రేట్ల పెంపుపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు ప్రభుత్వ అనుమతితో అప్పటికప్పుడు రేట్లు పెంచుకునే అవకాశం మళ్లీ లభించినట్లయింది.

అల్లు అర్జున్ హాలీవుడ్‌లో రాణించాలి: సీఎం రేవంత్

Next Story