అల్లు అర్జున్ హాలీవుడ్‌లో రాణించాలి: సీఎం రేవంత్

by Gantepaka Srikanth |

అల్లు అరవింద్ కుటుంబం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘అల్లు సినిమాస్‌’ (Allu Cinemas) మల్టీప్లెక్స్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు.

అల్లు అర్జున్ హాలీవుడ్‌లో రాణించాలి: సీఎం రేవంత్
X

దిశ, వెబ్‌డెస్క్: అల్లు అరవింద్ కుటుంబం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘అల్లు సినిమాస్‌’ (Allu Cinemas) మల్టీప్లెక్స్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్‌లోని ఐటీ హబ్ కోకాపేటలో అత్యాధునిక హంగులతో దీనిని రూపొందించారు. ఈ సందర్భంగా అల్లుకుంటుంబానికి సీఎం అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘నేను సినిమా అభిమానిని. భారతదేశ సినిమా చాలా అభివృద్ధి చెందింది. ఈ అభివృద్ధిలో తెలుగు సినిమాదే కీలక పాత్ర. కాలేజీ రోజుల్లో నేను చాలా సినిమాలు థియేటర్లలో చూశాను. లారీల్లో వెళ్లి సినిమాలు చూసి తిరిగొచ్చేవాళ్లం. ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ సంవత్సరానికి నాలుగైదు సినిమాలు తీసేవారు. ఇప్పుడు స్టార్ హీరోలంతా ఏడాకొకటి, రెండేళ్లకో సినిమా తీస్తున్నారు. సినిమా అనేది కేవలం వినోదం మాత్రమే కాదు.. మధ్యతరగతి ప్రజలను సినిమా చాలా ప్రభావితం చేస్తుంది.

ఐటీ, ఫార్మాతో పాటు సినిమా ఇండస్ట్రీని కూడా ప్రభుత్వం గొప్ప పరిశ్రమగా భావిస్తోంది. చిత్రపరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుంది. తెలుగు సినిమా ఇప్పుడు హాలీవుడ్‌తో పోటీ పడుతోంది. హాలీవుడ్ సినిమాలు హైదరాబాద్‌లో షూటింగ్ చేసేస్థాయికి తీసుకెళ్లే స్థాయికి తీసుకెళ్లాలి. దాంతో పాటు హైదరాబాద్‌లోని కృష్ణానగర్ చాలా గొప్ప వ్యక్తులను ఇండస్ట్రీకి ఇచ్చింది. అల్లు అర్జున్ ఇంకా రాణించాలి. ఇప్పటివరకు తన టాలెంట్‌ను దేశంలో ప్రూవ్ చేసుకున్నారు. రేపు హాలీవుడ్‌ వరకు వెళ్లాలి. హాలీవుడ్ సినిమాలతో పోటీ పడేలా ఆయన భవిష్యత్ ఉండాలి’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.

Next Story