గురువారం తప్పని గురి..! ఆ వారమే మావోయిస్టు అగ్రనేతల ఎన్‌కౌంటర్లు

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-12 11:31:24  IST  )

మావోయిస్టు అగ్రనేతల ఎన్‌కౌంటర్లలో ‘గురువారం’ సెంటిమెంట్ కలకలం రేపుతోంది. కేంద్ర హోంశాఖ విధించిన మార్చి 31 డెడ్‌లైన్ సమీపిస్తుండటంతో రానున్న రెండు గురువారాల్లో ఏం జరగబోతుందనే ఉత్కంఠ నెలకొంది.

గురువారం తప్పని గురి..! ఆ వారమే మావోయిస్టు అగ్రనేతల ఎన్‌కౌంటర్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మావోయిస్టుల ఎన్‌కౌంటర్లపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అగ్రనేతలు, స్టేట్ కమిటీ సభ్యులు, డివిజన్ కమిటీ సభ్యుల ఎన్‌కౌంటర్లు జరిగిన తీరు తాజాగా ఆసక్తిని రేపుతోంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్‌లో భాగంగా ఇప్పటివరకు జరిగిన ఎన్‌కౌంటర్లు అన్నీ గురువారం మాత్రమే జరగడం చర్చనీయాంశం అయింది. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ విధించిన మార్చి 31 గడువుకు మరో రెండు గురువారాలే మిగిలి ఉండటంతో ఏం జరగబోతున్నదనే ఉత్కంఠ సర్వత్రా నెలకొన్నది.

గురువారమే అగ్రనేతల ఎన్‌కౌంటర్లు..

గత కొన్నేళ్లుగా జరిగిన ఎన్‌కౌంటర్లను పరిశీలిస్తే మావోయిస్ట్ పార్టీతోపాటు వారి కుటుంబ సభ్యులలో గురువారం వచ్చిందంటే ఏ వార్త వినాల్సి వస్తుందో అన్న ఆందోళన నెలకొని ఉంది. ఎందుకంటే.. పార్టీ కీలక నేతలంతా గురువారం రోజునే ఎన్‌కౌంటర్ కావడం గమనార్హం. ఈ వరుసలో అగ్రనేతలు సుధాకర్, మోడెం బాలకృష్ణ, పాక హన్మంతు, అనల్ దా, ఉదమ్ సింగ్ వంటి నేతలు ఉన్నారు. వారితోపాటు చలపతి, నంబాల కేశవరావు, హిడ్మా వంటి నేతలు కూడా ఎన్‌కౌంటర్‌‌లో మృతి చెందారు. అయితే ఈ ముగ్గురు బుధవారం చనిపోయారు. అలాగే లోకేటి చందర్ అలియాస్ ప్రభాకర్ శుక్రవారం మరణించారు. బుధ, గురువారాల్లోనే కీలక నేతల ఎన్‌కౌంటర్లు జరగటం వెనుక ఆంతర్యం ఎంటనేది అంతుబట్టడం లేదు. ప్రధాన ఎన్‌కౌంటర్లు, కీలక నేతల లొంగుబాటు ప్రకటనలు కూడా గురువారమే జరిగడం విశేషం.

- జనవరి 10న ఛత్తీస్‌గఢ్, బీజాపూర్ సుక్మా ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌‌లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు.

- జనవరి 16న ఛత్తీస్‌గఢ్, బీజాపూర్ జిల్లా బస్తర్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌‌లో 12 మంది నక్సల్స్ మృతి చెందారు.

- ఒడిశా స్టేట్ కమిటీ సభ్యుడు, ధమ్‌తరి- గరియాబంద్ నౌపాడా డివిజన్ కమిటీ కార్యదర్శి సత్యం గాడ్‌వే జనవరి 23న మృతి చెందారు.

- మార్చి 21న ఛత్తీస్‌గఢ్, బీజాపూర్ కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌‌లో 30మంది మవోయిస్టులు మరణించారు.

- మే 23న బీజాపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌‌లో ఓ మావోయిస్ట్ మృతి చెందాడు.

- జూన్ 6వ తేదీన ఛత్తీస్‌గడ్ బీజాపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌‌లో కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ అలియాస్ తెంటు లక్ష్మీ నరసింహచలం అలియాస్ గౌతమ్ మృతి చెందారు. ఆయన 40ఏళ్లపాటు ఉద్యయంలో కీలక పాత్ర పోషించగా, కోటి రూపాయల రివార్డ్ ఉంది.

- సెప్టెంబర్ 11న ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌‌లో మావోయిస్టు పార్టీ అగ్రనేత మోడెం బాలకృష్ణ అలియాస్ మనోజ్, అలియాస్ భాస్కర్, అలియాస్ బాలన్న అలియాస్ రామచందర్ మృతి చెందారు. ఆయనపై కోటి రూపాయల రివార్డ్ ఉంది. అలాగే ఒడిశా స్టేట్ కమిటీ సభ్యుడు పాండు అలియాస్ ప్రమోద్, మరో 8మంది మావోయిస్టులు మృతి చెందారు.

- 2026 జనవరి 23న జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భమ్ జిల్లాలో సరండ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌‌లో కేంద్ర కమిటీ సభ్యుడు పాటీరాం మాంఘీ అలియాస్ అనల్ దా మృతి చెందారు. ఆయనపై రూ.2.35కోట్ల రివార్డ్ ఉంది. మరో 15 మంది మావోయిస్టులు సైతం మృతి చెందారు.

- ఫిబ్రవరి 6న మవోయిస్ట్ అగ్రనేత ఉధమ్ సింగ్ బీజాపూర్ ఎన్‌కౌంటర్‌‌లో మృతి చెందారు.

బుధవారం రోజున..

- 2025 జనవరి 21 కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి అలియాస్ ప్రతాప్‌రెడ్డి, అలియాస్​ అప్పారావు, రవి అలియాస్ జయరాం ఛత్తీస్‌గఢ్‌- ఒడిశా సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. ఆయనతోపాటు మరో 15మంది సభ్యులు చనిపోయారు.

- 2025 మే 21 మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లా, గుండెకోట్ అడవులలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించారు. ఆయనపై కోటిన్నర పైగా రివార్డ్ ఉంది. ఈ ఘటనలో మరో 26మంది హతులయ్యారు.

గురువారం జరిగిన మరికొన్న ఘటనలు..

- జూలై 17వ తేదీన రాచకొండ సీపీ సమక్షంలో జేఎన్ఎం వ్యవస్థాకుడు సంజీవ్ దంపతులు లొంగిపోయారు.

- జూలై 24వ తేదీన మావోయిస్ట్ పార్టీ సభ్యులు శ్రీవిద్యను అదుపులోకి తీసుకున్నారు.

- అక్టోబర్ 16న అగ్రనేతలు ఆశన్న, బండి ప్రకాశ్ లొంగుబాటు.

- 2026 జనవరి 2న అగ్రనేత బార్సే దేవా సరెండర్.

ఛత్తీస్‍గఢ్‍లో భారీ ఎన్ కౌంటర్.. తెలంగాణ నేత భాగ్య దళంపై భీకర కాల్పులు!

Next Story