- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఛత్తీస్‍గఢ్‍లో భారీ ఎన్ కౌంటర్.. తెలంగాణ నేత భాగ్య దళంపై భీకర కాల్పులు!
ఛత్తీస్‌గఢ్‌లోని నార్త్ బస్తర్‌లో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య భారీ ఎదురుకాల్పులు జరుగుతున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: మావోయిస్టులను అంతమొందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్‍లో భాగంగా మావోయిస్టులకు మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా ఛత్తీస్‍గఢ్ నార్త్ బస్తర్ కోయిల్ బేడలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, మాడ్ డీవీసీఎంగా ఉన్న రంగబోయిన భాగ్య అలియాస్ రూపీ దళానికి మధ్య భీకర కాల్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో నిన్న సాయంత్రం భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నట్లు కాంకెర్ ఎస్పీ నిఖిల్ రఖేచా తెలిపారు. బలగాలు అనుమానిత ప్రదేశాన్ని చుట్టుముట్టగానే మావోయిస్టులు ముందుకు వస్తున్న దళాలపై కాల్పులు జరిపాయి. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే ఎదురు కాల్పులు జరిపాయి. ఈ క్రమంలో చీకటి పడటంతో మావోయిస్టులు అటవీ ప్రాంతంలోపలికి పారిపోయినట్లు ఎస్పీ తెలిపారు. కాల్పులు జరిగిన ప్రదేశంలో మావోయిస్టు సాహిత్యం, మావోయిస్టులు వదిలి వెళ్లిన రోజువారీ వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ కాల్పుల్లో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని ప్రస్తుతం కూంబింగ్ ఇంకా కొనసాగుతున్నట్లు తెలిపారు.
పెద్ద ఎత్తున మావోయిస్టుల హతం?:
అయితే ఈ కాల్పుల్లో పెద్ద ఎత్తున మావోయిస్టులు మృతి చెందినట్లు పలు న్యూస్ చానల్స్ రిపోర్టు చేస్తున్నాయి. దీంతో ఈ కాల్పులు ముగిసే సమయానికి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాబోతోంది అనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు కాల్పుల నేపథ్యంలో చుట్టుపక్కల అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు కూంబింగ్ ముమ్మరం చేశాయని, పారిపోతున్న మావోయిస్టులను పట్టుకోవడానికి అదనపు బృందాలను మోహరించినట్లు ఎస్పీ తెలిపారు. రోడ్డు దిగ్బంధనాలను బలోపేతం చేశాయని వెల్లడించారు.
లొంగిపోమ్మని ఇటీవలే తల్లి పిలుపు:
ప్రస్తుతం మావోయిస్టు పార్టీకి ప్రాతినిథ్యం వహిస్తున్న మొత్తం ఎడుగురిలో రంగబోయిన భాగ్య అలియాస్ రూపీ ఒకరు. ఈమె సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామవాసి. భాగ్య 16 ఏళ్ల వయసులో ఉండగా దళంలోకి వెళ్లి 24 ఏళ్లుగా అజ్ఞాతంలో నే ఉంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోగా వారిలో భాగ్య కూడా ఉంటుందేమో అని ఆమె తల్లి రంగబోయిన ఎల్లవ్వ ఎంతో ఆశపడింది. కానీ వారిలో తన కూతురు లేదని తెలుసుకుని నిరాశ చెందింది. దీంతో బిడ్డా లొంగిపో అంటూ పిలుపునిచ్చింది. తన ఆరోగ్యం బాగోలేదని చావు ఎప్పుడొస్తుందో తెలియదు. 24 ఏళ్లుగా నీ కోసం కండ్లు కాయలు కాసేలా ఎదురు చూశాను. 9 ఏళ్ల కింద మీ నాయిన చచ్చిపోయిండు. ఇప్పుడు నేను చచ్చిపోతే నువ్వు వస్తావో రావో తెలియదు. నేను బతికుండగా ప్రాణాలతో వస్తావో ఎన్ కౌంటర్ అయి వస్తావో తెలియడం లేదు. నువ్వు ఏడున్నా పోలీసులకు లొంగిపో బిడ్డా ఒక్కసారి కడ సూపుకన్నా నోచుకుంటానంటూ ఆవేదనతో పిలుపునిచ్చింది. తల్లి పిలుపు ఇచ్చి






