- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉరుములు, మెరుపులతో కూడిన తుఫాను.. తెలంగాణకు భారీ వర్ష సూచన
తెలంగాణలో నేడు భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ సహా పలు జిల్లాలకు వడగళ్ల వాన మరియు ఈదురు గాలుల హెచ్చరిక జారీ చేయబడింది.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా ఎండలు 40 డిగ్రీల కంటే ఎక్కువే నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 44 నుంచి 45 మధ్య ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలు కాస్త ఉపశమనం కలిగించాయి. అయితే తాజా అలర్ట్ ప్రకారం తెలంగాణలోని తూర్పు, మధ్య, పశ్చిమ జిల్లాలో భారీ ఉరుములతో కూడిన తుపాన్లు వచ్చే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. ముఖ్యంగా నల్గొండ, యాదాద్రి భువనగిరి, జనగామ, వరంగల్, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో తీవ్రమైన ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉంది.
కొన్ని చోట్ల వడగళ్ల వాన (Hailstorm) కురిసే ఛాన్స్ ఉండటంతో పాటు భారీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెదర్ మ్యాన్ రిపోర్టు స్పష్టం చేస్తోంది. అలాగే రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కూడా నిన్నటి తరహాలోనే వాతావరణం ఉండే అవకాశం ఉంది. నగరం మొత్తంలో సుమారు 50 శాతం ప్రాంతాల్లో తీవ్రమైన తుఫాను ప్రభావం కనిపిస్తుంది. ముఖ్యంగా సాయంత్రం నుంచి అర్ధరాత్రి మధ్యలో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షం సమయంలో చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల దగ్గర నిలబడవద్దని, వాహనదారులు ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.






