- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్రమంత్రికి తుమ్మల కీలక రిక్వెస్ట్
రాష్ర్టంలో 3,300 ఎకరాల కొబ్బరి సాగు జరుగుతుందని భద్రాద్రి కొత్తగూడెంలో కొబ్బరి అభివృద్ధి బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రమంత్రి శివరాజ్సింగ్చౌహాన్ ను కోరారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో 3,300 ఎకరాల కొబ్బరి సాగు జరుగుతుందని భద్రాద్రి కొత్తగూడెంలో కొబ్బరి అభివృద్ధి బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రమంత్రి శివరాజ్సింగ్చౌహాన్ ను కోరారు. సోమవారం తెలంగాణ పర్యటనకు వచ్చిన ఆయనకు లేఖలో అభ్యర్థించారు. భద్రాద్రి కొత్తగూడెం 1,757 ఎకరాలు, ఖమ్మంలో 696 ఎకరాలు సాగును చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని మిగతా జిల్లాలలో కూడా కొబ్బరిసాగును విస్తరించేందుకు అవకాశాలు ఉన్నాయని, గతంలో హైదరాబాద్ కార్యాలయంగా కొబ్బరిబోర్డు కార్యాలయం ఉండేదని, కాని విభజన అనంతరం అది విజయవాడకు తరలించబడిందన్నారు. దీంతో రాష్ట్ర కొబ్బరి రైతులు సకాలంలో సేవలు అందుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల సంక్షేమం దృష్ట్యా ఆశ్వారావుపేట కానీ దమ్మపేటలో పూర్తిస్థాయిలో కొబ్బరి అభివృద్ధి బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఆయిల్ పామ్ సాగు కోసం కేంద్రం చేపట్టిన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ - ఆయిల్ పామ్ కింద రాష్ట్రం 1.25 లక్షల హెక్టార్లకు లక్ష్యంగా 75 వేల హెక్టార్లలో సాగు చేపట్టి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి నాణ్యమైన ఆయిల్ పామ్ విత్తనాలు కీలకమని, దేశీయంగా సరిపడా విత్తనాలు అందుబాటులో లేవన్నారు. ఆయిల్ పామ్ కంపెనీలు విదేశాలనుండి విత్తనాలను దిగుమతి చేసుకుంటున్నాయన్నారు. నాణ్యమైన విత్తనాలను అందించే సరఫరాదారుల సమాచారం లేనందున, కంపెనీలు కేవలం ఐదారుగురు సరఫరదారులపైనే ఆధారపడుతున్నారని తెలిపారు. నాణ్యమైన విత్తనాల సరఫరాదారులను గుర్తించి ఎంప్యానల్ చేస్తే రైతులకు నష్టాలు రాకుండా ఆయిల్ పామ్ అభివృద్ధిని వేగవంతం చేయవచ్చన్నారు.
టన్ను ఆయిల్ పామ్ గెలల కనిష్ఠ మద్దతు ధర రూ.25 వేలుగా నిర్ణయించాలి కోరారు. అదే విధంగా ఆయిల్ పామ్ దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని పేర్కొన్నారు. ఇప్పటికే దేశీయ ఆయిల్ పామ్ రైతుల ప్రయోజనార్థం దిగుమతి సుంకాన్ని 27.5 శాతం నుంచి 40 శాతానికి పెంచాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరపున కోరిన కేంద్రం దిగుమతి సుంకాన్ని తగ్గించడం బాధాకరమని అభిప్రాయపడ్డారు. అంతేగాకుండా కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీకి రూ.100 కోట్లు మంజూరు చేయాలన్నారు.






