సమయపాలన పాటించని ఉద్యోగులపై చర్యలు : మంత్రి తుమ్మల

by Naga Rani Yarlagadda |

ఆలస్యంగా విధులకు హాజరయ్యే ఉద్యోగులపై సేవా నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆయిల్​ఫెడ్​ఎండీని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదేశించారు.

సమయపాలన పాటించని ఉద్యోగులపై చర్యలు : మంత్రి తుమ్మల
X
  • ఆయిల్​ఫెడ్ కార్యాలయంలో ఆలస్యంగా హాజరు
  • ఆరుగురు ఉద్యోగులకు మోమోలు జారీ
  • ఉద్యోగుల తీరుపై మంత్రి తుమ్మల అసంతృప్తి

దిశ, తెలంగాణ బ్యూరో : ఆలస్యంగా విధులకు హాజరయ్యే ఉద్యోగులపై సేవా నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆయిల్​ఫెడ్​ఎండీని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. శనివారం తెలంగాణ సహకార నూనెగింజల ఉత్పత్తిదారుల సమాఖ్య ప్రధాన కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 10.30 గంటల వరకు పలువురు అధికారులు, ఉద్యోగులు విధులకు హాజరుకాకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. సమయ పాలన పాటించని ఉద్యోగులపై సంస్థ సేవా నియమావళి ప్రకారం ఎండి క్రమశిక్షణా చర్యలు చేపట్టారు. ఆలస్యంగా హాజరైన ఆరుగురు రెగ్యులర్ ఉద్యోగులకు మెమోలు జారీ చేయగా, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల్లో ఇద్దరి సేవలను రద్దు చేశారు. మరో ఇద్దరిని బదిలీ చేయగా, ముగ్గురు ఉద్యోగులకు మెమోలు జారీ చేశారు. ప్రభుత్వ సంస్థల్లో సమయపాలన, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన విధి నిర్వహణ, ప్రజలకు సమర్థవంతమైన సేవలందించడం అత్యంత ప్రాధాన్యమైన అంశాలని ఆయిల్​ఫామ్​ఎండి పేర్కొన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఉద్యోగులు సంస్థ నియమాలను కచ్చితంగా పాటిస్తూ నిర్ణీత సమయానికి విధులకు హాజరై, సంస్థ ప్రతిష్ఠను మరింత పెంపొందించేలా పనిచేయాలని సూచించారు.

Next Story