- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Thummala: చేనేత పథకాలపై మంత్రి తుమ్మల కీలక సమీక్ష
by Prasad Jukanti |
చేనేత పథకాలపై మంత్రి తుమ్మల కీలక సమీక్ష నిర్వహించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: చేనేత రంగంలో తెలంగాణకు ప్రత్యేక స్థానం ఉందని, రాష్ట్రాకి చెందిన వివిధ రకాల చేనేత వస్త్రాలను జాతీయ చేనేత దినోత్సవం రోజు ఏర్పాటు చేసే ప్రదర్శనలో ఆయా సంఘాల ద్వారా ప్రదర్శించాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) ఆదేశించారు. ఆగస్టు 7 జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఏర్పాట్లపై మంత్రి ఇవాళ సెక్రటేరియట్ లో కీలక సమావేశం నిర్వహించారు. చేనేత, జౌళి శాఖ పథకాల అమలుపై అధికారులను ఆరా తీశారు. మహిళాశక్తి స్కీమ్ లో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు అందించనున్న చీరల ఉత్పత్తిని వేగవతం చేయాలన్నారు. చేనేత రుణ మాఫీ పథకం లబ్ధిదారుల ఎంపికను వేగవంతం చేసి ఖాతాల్లో నిధులు జమచేయాలని అధికారులను ఆదేశించారు. నేతన్న పొదుపు, భరోసా పథకాలను పటిష్టంగా అమలు చేయాలని సూచించారు.
Next Story






