యూరియాను కేటాయింపుల ప్రకారం కేంద్రం సరఫరా చేయలేదు

by velandi.Saikiran |

దేశంలో ఏ రాష్ట్రంలోను యూరియా కొరత లేదని, తెలంగాణ ప్రభుత్వమే కృత్రిమ కొరత సృష్టిస్తోందని బీజేపీ చీప్​

యూరియాను కేటాయింపుల ప్రకారం కేంద్రం సరఫరా చేయలేదు
X

యూరియా కొరత లేదనడం బీజేపీ చీప్​రామచంద్రరావు అవగాహన రాహిత్యం

రాష్ట్ర ప్రభుత్వం ఎరువుల కృత్రిమ కొరత ఎక్కడ సృష్టించడం లేదు

యూరియాను కేటాయింపుల ప్రకారం కేంద్రం సరఫరా చేయలేదు : మంత్రి తుమ్మల

దిశ, తెలంగాణ బ్యూరో : దేశంలో ఏ రాష్ట్రంలోను యూరియా కొరత లేదని, తెలంగాణ ప్రభుత్వమే కృత్రిమ కొరత సృష్టిస్తోందని బీజేపీ చీప్​రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలు అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. రాష్ట్రానికి కేంద్రం ఎంత యూరియా కేటాయించింది, ఎంత సరఫరా చేసింది అనే వాస్తవాలను ముందుగా తెలుసుకోవాలని సూచించారు. కేవలం తెలంగాణలోనే కాదు, పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో కూడా యూరియా కొరత ఉందని తెలిపారు. బీజేపీ రైతు మిత్ర ప్రభుత్వం కాదని, రైతు వ్యతిరేక ప్రభుత్వమని ధ్వజమెత్తారు. గురువారం ఒక ప్రకటనలో పేర్కొంటూ కేంద్రం రాష్ట్ర అవసరాలకు మించి యూరియా ఇచ్చిందని, తెలంగాణ ప్రభుత్వం రైతులకు పంపిణీ చేయలేకపోయిందని విమర్శలు అర్ధరహితమని వ్యాఖ్యానించారు.

ఇలాంటి ఆరోపణలు తెలంగాణ బీజేపీ పార్టీకి రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధిని శంకింప చేస్తున్నాయన్నారు. ముందుగా అన్ని వివరాలు తెలుసుకొని సీబీఐ విచారణలు వంటి ప్రగల్భాలు పలకాలని హితవు పలికారు. మరోసారి ఆయన అవగాహనా కోసం, భవిష్యత్తులో ఇలాంటి మాటలు మాట్లాడేముందు తెలుసుకొని మాట్లాడుతారని ఆశిస్తున్నాను మరోసారి పూర్తి వివరాలను పంపిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ నుండి ఆగస్టు నెల వరకు కేంద్రం రాష్ట్రానికి 8.30 లక్షల మెట్రిక్​టన్నుల కేటాయిస్తే ఇప్పటివరకు 5.12 ఎల్​ఎంటీలు మాత్రమే సరఫరా చేసిందన్నారు. రాష్ట్రానికి రావాల్సిన యూరియా కంటే 3.20 ఎల్​ఎంటీలు యూరియా తక్కువగా సరఫరా మోడీ ప్రభుత్వం చేసిందని వెల్లడించారు. ఆయన దగ్గర ఏమైనా వివరాలు ఉంటే ఇవ్వాలని నరం లేని నాలుకతో ఏదో నోటికొచ్చింది మాట్లడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రైతుల ప్రయోజనార్థం రాష్ట్రానికి రావాల్సిన యూరియాను త్వరగా తెప్పించాలని కోరారు.

Next Story