- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిజాంసాగర్ బ్యాక్ వాటర్ లో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతు
క్రికెట్ ఆట ఆడేందుకు వెళ్లి ఎండ వేడిమితో సరదాగా స్నానాలు చేద్దామని నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లోకి వెళ్లిన ముగ్

దిశ, నిజాంసాగర్ : క్రికెట్ ఆట ఆడేందుకు వెళ్లి ఎండ వేడిమితో సరదాగా స్నానాలు చేద్దామని నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లోకి వెళ్లిన ముగ్గురు యువకులు ప్రమాదవశాత్తు నీట మునిగి గల్లంతయ్యారు. ఈ సంఘటన సోమవారం మహమ్మద్ నగర్ మండలంలోని హాసన్ పల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది.
నిజాంసాగర్ ఎస్ఐ శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన మధుకర్ గౌడ్ (17) అనే ఇంటర్మీడియట్ విద్యార్థులతో పాటు, తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన నవీన్ (23), సోమార్ పేట్ గ్రామానికి చెందిన హర్షవర్ధన్ (17) అనే ముగ్గురు యువకులు కలిసి ఎల్లారెడ్డి మండలం సోమార్ పేట ప్రాంతంలో కొంతమంది యువకురులతో కలిసి క్రికెట్ ఆట ఆడేందుకు వెళ్లారు.
మధ్యాహ్నం వేళ ఎండ వేడిమి ఎక్కువగా ఉండడంతో స్నానం చేసేందుకు హాసన్ పల్లి గ్రామ శివారులోని నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో దిగి సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లారు. ఈత కొట్టేందుకు వెళ్లిన ముగ్గురు యువకులు ప్రమాదవశాత్తు నీట మునిగి గల్లంతయ్యారు. గ్రామస్తుల సమాచారంతో విషయం తెలుసుకున్న నిజాం సాగర్ పోలీసులు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి నీట మునిగి గల్లంతయిన యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్ఐ శివకుమార్ తెలిపారు.






