Vemulawada: మైనర్ బాలుడిపై ముగ్గురు యువకుల దాడి.. ఏకంగా కత్తులతోనే !

by velandi.Saikiran |

వేములవాడ రాజన్న సన్నిధిలో ( Vemulawada) దారుణం జరిగింది. ఓ మైనర్ బాలుడిని ( Minor) చూసి.. ముగ్గురు యువకులు

Vemulawada: మైనర్ బాలుడిపై ముగ్గురు యువకుల దాడి.. ఏకంగా కత్తులతోనే !
X

దిశ, వెబ్ డెస్క్: వేములవాడ రాజన్న సన్నిధిలో ( Vemulawada) దారుణం జరిగింది. ఓ మైనర్ బాలుడిని ( Minor) చూసి.. ముగ్గురు యువకులు దారుణంగా వ్యవహరించారు. ఒక్కడిని చేసి కొట్టారు. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం జరిగినట్లు తెలుస్తోంది. వేములవాడ పట్టణంలోని ఓ నిర్మానుష్యంగా ఉన్న ఏరియా నుంచి 16 సంవత్సరాల బాలుడు వెళ్తున్నాడు. ఈ నేపథ్యంలోనే బ్లూ కలర్ స్కూటీ పైన ( Scooty) ముగ్గురు యువకులు వచ్చారు.

మొదట ఆ కుర్రాడితో మాట్లాడి అనంతరం.. చెంపలపై దారుణంగా కొట్టారు. ఎందుకు కొడుతున్నారు ? అని.. ఎదురు ప్రశ్నిస్తే.. కత్తులతో చంపేస్తామంటూ కూడా బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో అక్కడి నుంచి చాకచక్యంగా కుర్రాడు పారిపోయాడు. అక్కడే ఉన్న ఓ CC కెమెరాలో ఈ ఫుటేజ్ రికార్డు అయింది. ఈ వీడియో బయటకు రావడంతో వేములవాడ పోలీసులు.. ఈ సంఘటనపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటన వెనుక ప్రేమ వ్యవహారం ఉండి ఉంటుందని.. అందుకే దాడి చేశారని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు.. తెలియాల్సి ఉంది.

Next Story