- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో విషాద ఘటనలు.. వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు మృతి
రాష్ట్రంలో వేర్వేరు ఘటనల్లో ముగ్గురు దుర్మరణం చెందారు. ఒకరు రోడ్డుప్రమాదంలో మరణించగా, మరో యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. ఇంకొకరు హత్యకు గురయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో జరిగిన వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మరణించారు. ఒకరు రోడ్డు ప్రమాదంలో చనిపోగా.. మరొకరు సూసైడ్ చేసుకున్నారు. ఇంకొక యువకుడిని దారుణంగా హతమార్చారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని రోడ్డుపై గత అర్ధరాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో సింగరేణి కార్మికుడు మరణించాడు. మృతుడిని శ్రీధర్ గా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా.. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఓయో హోటల్లో యువకుడి సూసైడ్
హైదరాబాద్ నగరంలో ఓ యువకుడు ఓయో హోటల్లో సూసైడ్ చేసుకున్నాడు. కేపీహెచ్ బీ పరిధిలోని అడ్డగుట్టలో ఉన్న ఓయో హోటల్ లో ఈ ఘటన జరిగింది. హోటల్ యాజమాన్యం సమాచారంతో అక్కడికి వెళ్లిన పోలీసులు మృతుడిని అనంతపురం జిల్లా చెర్లోపల్లికి చెందిన లోకేష్ (29)గా గుర్తించారు. ప్రాణంగా ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకునేందుకు పెళ్లి బట్టలు కొన్న లోకేష్.. ఫుడ్ తీసుకుని రమ్మని ఆమెను బయటకు పంపి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. మృతుడు పెళ్లి బట్టలు వేసుకుని సూసైడ్ చేసుకోవడం పోలీసుల్ని విస్మయానికి గురిచేసింది. ఇద్దరి మధ్య అంతకుముందు ఏమైనా గొడవ జరిగిందా? లోకేష్ ఎందుకు చనిపోయాడు?అన్న విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పాతకక్షలతో యువకుడి హత్య
నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కారులో వెళ్తున్న యువకుడిని దుండగులు టిప్పర్ లారీతో ఢీ కొట్టారు. తీవ్రంగా గాయపడిన అతడిని రాళ్లతో కొట్టి మరీ చంపేశారు. పాతకక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.






