Graduate MLC: ‘గ్రాడ్యుయేట్’ ఫలితాల్లో త్రిముఖ పోటీ!.. ముగ్గురు అభ్యర్థులకు పోటాపోటీగా ఓట్లు?

by Prasad Jukanti |

‘గ్రాడ్యుయేట్’ ఫలితాల్లో ముగ్గురు అభ్యర్థులకు పోటాపోటీగా ఓట్లు పడినట్లు తెలుస్తోంది.

Graduate MLC: ‘గ్రాడ్యుయేట్’ ఫలితాల్లో త్రిముఖ పోటీ!.. ముగ్గురు అభ్యర్థులకు పోటాపోటీగా ఓట్లు?
X

దిశ, డైనమిక్ బ్యూరో: కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ (Graduate MLC) స్థానానికి సంబంధించి అభ్యర్థుల వారీగా ఓట్ల లెక్కింపు (MLC Vote Counting) ప్రక్రియ కొనసాగుతున్నది. పట్టభద్రుల స్థానంలో విజయం ఎవరిని వరించబోతున్నదన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. రాష్ట్ర రాజకీయాల్లో రాబోయే పరిణామాలకు ఈ ఎన్నిక కీలకం కాబోతున్నదన్న చర్చ నేపథ్యంలో గెలుపు ఎవరివైపు నిలుస్తుందనేది ఆసక్తిని రేపుతున్నది. ప్రాథమిక సమాచారం మేరకు ఇప్పటి వరకు బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, కాంగ్రెస్ (Congress) అభ్యర్థి నరేందర్‌రెడ్డి, బీఎస్పీ (BSP) అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మధ్య త్రిముఖ పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ సాయంత్రం 4 గంటల వరకు ఫలితాలపై ఓ అంచనా ఏర్పడవచ్చనే టాక్ వినిపిస్తోంది. అయితే మొత్తం 2,50,106 పోలైన ఓట్లు ఉండగా 2 లక్షల 10 వేల ఓట్ల ప్రాథమిక లెక్కింపు ముగిసింది. ఇందులో 21 వేల ఓట్లు చెల్లకుండా పోగా 1 లక్షా 89 వేల ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. ఇంకా 40 వేల ఓట్లు ప్రాథమిక లెక్కింపు కావాల్సి ఉంది. ఇప్పటి వరకు బ్యాలెట్ పత్రాలను సరిపోల్చే ప్రక్రియ కొనసాగింది. ఓట్ల వడబోతను చేపట్టిన అధికారులు వాటిని కట్టలు కట్టారు. ఇక వాటిని అభ్యర్థుల వారీగా మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టినట్లు సమాచారం.

Next Story