- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TSPSC కేసులో మరో ముగ్గురికి రిమాండ్
టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. ఈ కేసులో మరో ముగ్గురికి కోర్టు రిమాండ్ పంపింది.

దిశ, డైనమిక్ బ్యూరో: టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. ఈ కేసులో మరో ముగ్గురికి కోర్టు రిమాండ్ పంపింది. ఇవాళ సిట్ అరెస్ట్ చేసిన రమేష్, సురేష్, షమీమ్ ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ ముగ్గురికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. పలువురు టీఎస్ పీఎస్సీ ఉద్యోగులకు నోటీసులు ఇచ్చిన సిట్ .. గ్రూప్-1 రాసిన కమిషన్ ఉద్యోగులపై ఆరా తీస్తోంది. ఈ క్రమంలో మరి కొందరు ఉద్యోగులకు వచ్చిన మార్కులను తెలుసుకుంటోంది. ఈ క్రమంలో గ్రూప్-1 లో షమీమ్ కు 127, రమేష్ కు 122 మార్కులు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న రాజశేఖర్ నుంచి గ్రూప్-1 ప్రలిమ్స్ ప్రశ్నపత్రం డబ్బులు ఇవ్వకుండానే తీసుకున్నట్లు షమీమ్ తెలిపాడు.
ఇవి కూడా చదవండి : గ్రామాల అభివృద్ధికి కృషి.. ప్రత్యేక నిధులు మంజూరు : ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి






