గ్రామాల అభివృద్ధికి కృషి.. ప్రత్యేక నిధులు మంజూరు : ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి

by Disha Web Desk 13 |
గ్రామాల అభివృద్ధికి కృషి.. ప్రత్యేక నిధులు మంజూరు : ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి
X

దిశ, మెదక్ ప్రతినిధి: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి అన్నారు. గురువారం మధ్యాహ్నం హవేలీ ఘన్పూర్ మండలం కూచన్ పల్లి ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి పాపన్నపేట మండలంలోని పలు గ్రామాలకు కేటాయించిన పనులకు సంబంధించిన మంజూరు ధ్రువపత్రాలను ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ లకు అందజేశారు.

పాపన్నపేట మండలంలోని పలు గ్రామాలకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి 78.5 లక్షల రూపాయలను మంజూరు చేసినట్లు తెలిపారు. పాపన్నపేట మండలానికి చెందిన ఆరేపల్లి, కందిపల్లి, కొంపల్లి, లక్ష్మీ నగర్, మల్లంపేట్, మిన్పూర్, నార్సింగి, నర్సింగరావు పల్లి, రామతీర్థం, సీతానగర్ తదితర గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం, సీసీ డ్రైన్ల నిర్మాణం, ప్రహరీ గోడల నిర్మాణం, మహిళలు తయారు చేసే ఉత్పత్తుల అమ్మకాల కేంద్ర నిర్మాణం, కమ్యూనిటీ హాల్ నిర్మాణం తదితర అభివృద్ధి పనులకు సంబంధించి రూ.78.5 లక్షల రూపాయల నిధులను సీడీపీ నుంచి కేటాయించినట్లు ఎమ్మెల్సీ తెలిపారు.

ఈ ధ్రువ పత్రాలను పాపన్న పేట్ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి తో కలిసి సంబంధిత సర్పంచ్, ఎమ్మెల్సీ తో పాటు పాపన్నపేట మండల పార్టీ మాజీ అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కుబేరుడు, సర్పంచులు శ్రీనాథరావు, లింగారెడ్డి పార్టీ, మండల బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నార్సింగ్ గోపాల్ రెడ్డి, కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి, లక్ష్మీ నగర్ ఏడుకొండలు, నర్సింగ రావుపల్లి విట్టల్, సీతానగర్ ఆశయ్య, రామతీర్థం కురుమ సంఘం అధ్యక్షులు సాయిలు, ఏడుపాయల దేవస్థానం మాజీ డైరెక్టర్ చెన్న గౌడ్ తదితర నాయకులు ఉన్నారు.

ఇవి కూడా చదవండి : TSPSC కేసులో మరో ముగ్గురికి రిమాండ్



Next Story