ప్రభుత్వం కీలక నిర్ణయం.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్లుగా మరో ముగ్గురి నియామకం

by Ramesh Naini |

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్లుగా మరో ముగ్గురిని ప్రభుత్వం నియమించింది.

ప్రభుత్వం కీలక నిర్ణయం.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్లుగా మరో ముగ్గురి నియామకం
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. (Telangana Public Service Commission) తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్లుగా మరో ముగ్గురిని ప్రభుత్వం నియమించింది. చంద్రకాంత్ రెడ్డి, విశ్వప్రసాద్ ఐపీఎస్, ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్‌లను నియమించారు. వీరి నియామకం వారు పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు సోమవారం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఉత్తర్వులను జారీ చేశారు. ఈ సభ్యులు ఆరు ఏళ్లు లేదా వారికి 62 సంవత్సరాల వయస్సు వరకు పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Next Story