Rain Alert: తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు

by Phanindra |   (  Updated:2023-11-22 05:21:31  IST  )

మూడు రోజుల పాటు రాష్ట్రం లోని పలు చోట్ల వర్షాలు పడతాయని తెలిపారు.

Rain Alert: తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు
X

దిశ,వెబ్ డెస్క్: తెలంగాణకు మరోసారి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతుంది. దీని వల్ల ప్రజలు బయటకు కూడా రాలేకపోతున్నారు. ఇలాంటి సమయంలో మరో చల్లని వార్త చెప్పింది. రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు పడతాయని తెలిపారు. తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని చెప్పిన వాతావరణ శాఖ అధికారులు.. ఒకటి రెండు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం కూడా ఉందని వెల్లడించారు. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఈనెల 23 నుంచి 26 వరకు హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షాలు పడతాయన్నారు.

Next Story