- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్: TSPSC పేపర్ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ దూకుడు పెంచింది.

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ దూకుడు పెంచింది. సిట్ అధికారుల దూకుడుతో ఈ కేసులో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. కాగా, ఈ పేపర్ లీకేజీ కేసులో సిట్ అధికారులు బుధవారం మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. రవి కిశోర్, విక్రమ్, దివ్యలను అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. నల్లగొండ జిల్లాకు చెందిన అన్నాచెల్లెలు విక్రమ్, దివ్యలు డీఏవో పరీక్ష పేపర్ కొని పరీక్ష రాసినట్లుగా గుర్తించినట్లు తెలిపారు. మరో నిందితుడు రవికిశోర్ ఏఈ పేపర్ కొని ఇతరులకు అమ్మినట్లు వెల్లడించారు. తాజాగా ఈ ముగ్గురి అరెస్ట్‌లతో టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో అరెస్ట్‌ల సంఖ్య 39కి చేరుకుంది.
Also Read..
Next Story






