- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
T Congress: టీ కాంగ్రెస్ లో మీనాక్షి నటరాజన్ బిగ్ స్కెచ్.. వారికి చెక్ పెట్టేలా త్రీ గ్రూప్ ఫార్ములా
కొత్త ఇన్ చార్జి టీ కాంగ్రెస్ లో తనదైన మార్క్ క్రియేట్ చేస్తున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఏఐసీసీ దూతగా రాష్ట్రానికి ఇటివలే నియమితులైన మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) తెలంగాణ కాంగ్రెస్ (T Congress) లో తగ్గేదే లేదంటోంది. తనదైన వర్క్ స్టైల్ తో దూసుకుపోతున్నది. ఇప్పటికే వరుసగా నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్న కొత్త ఇన్ చార్జీ.. ప్రభుత్వం, పార్టీ మధ్య ఉన్న అంతరాలను తొలగించి ప్రజాక్షేత్రంలో పార్టీని మరింత వేగంగా పరుగులు పెట్టించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా గత కొంత కాలంగా హస్తం పార్టీకి తలనొప్పిగా మారిన కొత్త, పాత నేతల మధ్య సమన్వయం ఇష్యుకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు సరికొత్త ప్లాన్ తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. త్రీ గ్రూప్ ఫార్ములా (Three Group Formula) అమలు చేసి పార్టీలో నేతలకు పదవుల విషయంలో కొత్త విధివిధానాలు అమలుచేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
మూడు గ్రూపులుగా నేతలు:
రాష్ట్రంలో పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కొన్ని నియోజకవర్గాల్లో కొత్త పాత లీడర్లతో ఓవర్ లోడ్ అయింది. చేతిలో చిక్కనంత మంది నేతలు ఉండటంతో సొంత నేతలే ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలు ప్రత్యర్థులకు ఆయుధాలుగా మారుతున్నాయి. ఇక ఈ పరిస్థితికి చెక్ పెట్టకుండా పార్టీకి నష్టం తప్పదని గ్రహించిన అధిష్టానం పార్టీ నేతలను మూడు గ్రూపులుగా విభజించాలనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్లు ఒక గ్రూప్ గా, ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లను మరొక గ్రూప్ గా, పార్టీ అధికారంలోకి వచ్చాకా కండువా కప్పుకున్న వారిని మరో గ్రూప్ గా విభజించాలని మీనాక్షి నటరాజన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల భర్తీలో (Nominated posts) ఈ కేటగిరిల వారీగా ప్రధాన్యత ఇవ్వడం ద్వారా నేతలకు పార్టీకి మధ్య దూరం తగ్గించవచ్చనేది మీనాక్షి నటరాజన్ ఆలోచనగా తెలుస్తోంది. మరి ఈ కొత్త ఫార్ములా ఎంత వరకు అమల్లోకి వస్తుంది? ఒక వేళ అమల్లోకి వచ్చినా ఏ మేరకు వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి.






