- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిశ్చితార్థానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. అక్కడికక్కడే ముగ్గురు దుర్మరణం
నల్లగొండ జిల్లా గుర్రంపోడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును ఢీకొట్టి తర్వాత అదుపుతప్పి ఓ కారు చెట్టును ఢీకొట్టింది.

దిశ, కనగల్: నల్లగొండ జిల్లా గుర్రంపోడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును ఢీకొట్టి తర్వాత అదుపుతప్పి ఓ కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న ధనుంజయ గౌడ్ (50), నర్సింగ్ మధు గౌడ్ (35)తో పాటు కారులో ప్రయాణిస్తున్న బాల్‌రెడ్డి(55) సైతం అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ధనుంజయ, మధుగౌడ్ ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో కనగల్ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. స్థానికుల వివరాల ప్రకారం.. గుర్రంపోడు మండలం గుమ్మడవెల్లి వద్ద ఉన్న రైస్ మిల్లులో వడ్లు పోసిన డబ్బులు తీసుకోవడానికి బుధవారం ఉదయం ఇద్దరు ద్విచక్ర వాహనంపై వెళ్లారు. పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా, గుర్రంపోడు మండల పరిధిలోని చేపూరు ఎక్స్ రోడ్డు వద్ద దేవరకొండ వైపు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి వారి బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న ఝలక్ తీవ్రంగా ఉండడంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు. ఒకే కుటుంబంలో ఇద్దరిని కోల్పోవడంతో వారి ఆవేదనను మాటల్లో చెప్పలేనిది. గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది. మరోవైపు కారులో ఉన్న బాల్‌రెడ్డి స్పాట్‌లోనే మృతిచెందగా, అలివేలు, మంజూల, వెంకటమ్మలకు గాయాలు అయ్యాయి. వీరు నల్లగొండలో ఓ వివాహ నిశ్చితార్థానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






