Big Alert: మూడు రోజులు గజగజ.. తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్

by Ramesh Naini |

తెలంగాణలో చలి తీవ్ర స్థాయికి చేరుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది.

Big Alert: మూడు రోజులు గజగజ.. తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో చలి తీవ్ర స్థాయికి చేరుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ తాజాగా బిగ్ అలర్ట్ ఇచ్చింది. రాబోయే రెండు, మూడు రోజుల పాటు తెలంగాణలో తీవ్ర పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా.. దక్షిణ, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడే ఛాన్స్ ఉందని వివరించింది. అన్ని జిల్లాలలో కోల్డ్ వేవ్ కొనసాగుతుందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేసింది. ఉదయపు సమయాల్లో హైవేలపై ప్రయాణించే వారు జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించింది. అన్ని జిల్లాల్లో కోల్డ్ వేవ్ కొనసాగుతుందని, మధ్య రాత్రి నుంచి పూర్తిగా తెల్లవారే వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అవసరం అయితే తప్ప బయటకు రావొద్దని సూచించారు.

Next Story