ప్రగతిభవన్ చేరుకున్న ముగ్గురు సీఎంలు

by Sathputhe Rajesh |   (  Updated:2023-01-18 04:39:55  IST  )

కేరళ సీఎం పినరయి విజయన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ లు ప్రగతిభవన్‌కు చేరుకున్నారు.

ప్రగతిభవన్ చేరుకున్న ముగ్గురు సీఎంలు
X

దిశ, వెబ్ డెస్క్: కేరళ సీఎం పినరయి విజయన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ లు ప్రగతిభవన్ కు చేరుకున్నారు. వారితో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేష్, సీపీఐ నేత డి. రాజా కూడా ప్రగతిభవన్ కు కాసేపటి క్రితం వెళ్లారు. కాగా నేతలకు సీఎం కేసీఆర్ అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ముగ్గురు సీఎంలు ప్రగతిభవన్ చేరుకోవడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. అల్పహార విందు అనంతరం నేతలంతా 10.10 గంటలకు యాదాద్రికి బేగంపేట నుంచి హెలికాప్టర్ లో వెళతారు. 10.40 గంటలకు ముగ్గురు సీఎంలతో కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 11.40 కి యాదాద్రి నుంచి ఖమ్మం పయనమవుతారు. 12.20 కి ఖమ్మం చేరుకుంటారు. 2.30కి బీఆర్ఎస్ సభలో పాల్గొంటారు.

Also Read....

సాయంత్రం వరకు సస్పెన్స్​!! KCR​ ప్రసంగంపై తీవ్ర ఉత్కంఠ..!

Next Story