Harish Rao : అటవీశాఖ అనుమతి లేకుండా వేలాది చెట్లు కొట్టేశారు : హరీష్ రావు

by Muthe.Rajitha |

దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసిన కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం(Kancha Gachibouli Land Issue)పై సుప్రీంకోర్టు(Supreme Court) ఏర్పాటు చేసిన పర్యావరణ, కేంద్ర అటవీశాఖల సాధికారిక కమిటీ(Supreme Court Empowered Committee) నేడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU)లో భూములను పరిశీలించారు.

Harish Rao : అటవీశాఖ అనుమతి లేకుండా వేలాది చెట్లు కొట్టేశారు : హరీష్ రావు
X

దిశ, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసిన కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం(Kancha Gachibouli Land Issue)పై సుప్రీంకోర్టు(Supreme Court) ఏర్పాటు చేసిన పర్యావరణ, కేంద్ర అటవీశాఖల సాధికారిక కమిటీ(Supreme Court Empowered Committee) నేడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU)లో భూములను పరిశీలించారు. కాగా ఈ కమిటీని రాష్ట్ర ప్రతిపక్ష నేతలు కలిసి వివరాలు అందించారు. అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో వాల్టా చట్టం(Valta Act) ప్రకారం దరఖాస్తు చేసి, దాని అనుమతి వచ్చాకే చెట్లు ఇళ్ళు కట్టుకోవాలి కానీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే వేలాది చెట్లను కొట్టి వేయించింది.

TGIIC మాత్రం తాము చెట్లు కొడుతున్నాము రక్షణ కల్పించండి అని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అటవీ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే మూడు రోజుల పాటు వేలాది చెట్లను నాశనం చేశారని మండిపడ్డారు. సల్మాన్ ఖాన్(Salman Khan) ఒక జింకను చంపితే జైల్లో వేశారు, మరి ఇన్ని చెట్లు నరికివేస్తే, అందులో ఉన్న జింకల ప్రాణాలు పోవడానికి కారణం అయిన సీఎం రేవంత్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. వన్యప్రాణి చట్టం 29 (Wild Life Act 29) ప్రకారం వన్యప్రాణుల అవాసాలకు ఎలాంటి ముప్పు కలిగిస్తే.. చట్ట ప్రకారం నేరస్తులు అవుతారని, మరి 3 జింకలు చనిపోవడానికి కారణం అయిన ప్రభుత్వంపై ఏం చర్యలు తీసుకున్నారని నిలదీశారు.

Next Story