- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth Reddy : కులగణన సర్వేలో పాల్గొనని వారికి మైక్ ఇవ్వొద్దు : సీఎం రేవంత్ రెడ్డి
కులగణన(Ccaste Census) సర్వేలో పాల్గొనని శాసన సభ్యులకు దీనిపై చర్చలో మాట్లాడే అర్హత లేదని..సర్వేలో పాల్గొన్న వారికే మైక్ ఇవ్వాలని, సర్వేలో పాల్గొనని సభ్యులకు మైక్ ఇవ్వవద్ధని(Give Not Mic) స్పీకర్ గడ్డం ప్రసాద్(Speaker Gaddam Prasad)ను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)విజ్ఞప్తి చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : కులగణన(Ccaste Census) సర్వేలో పాల్గొనని శాసన సభ్యులకు దీనిపై చర్చలో మాట్లాడే అర్హత లేదని..సర్వేలో పాల్గొన్న వారికే మైక్ ఇవ్వాలని, సర్వేలో పాల్గొనని సభ్యులకు మైక్ ఇవ్వవద్ధని(Give Not Mic) స్పీకర్ గడ్డం ప్రసాద్(Speaker Gaddam Prasad)ను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)విజ్ఞప్తి చేశారు. కులగణన సర్వే లెక్కల చర్చలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, పద్మారావు, డీకే.అరుణ వంటి వారు సర్వేలో పాల్గొనలేదన్నారు.
సర్వే ప్రశ్నపత్రంలో 5వ పేజీలో భూముల వివరాలు చెప్పాల్సి వస్తుందని భయపడి సర్వేకు కేసీఆర్ కుటుంబం దూరంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇప్పటికైన వారంతా సర్వేలో వివరాలు అందించాలని కోరారు. సర్వేలో అడిగిన ప్రశ్నలతోనే కొంత మంది సర్వేకు దూరంగా ఉన్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా చెప్పారని చురకలేశారు. ఆయన అడిగినట్లుగా 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ జరుగాలన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ లకు చిత్తశుద్ధి ఉంటే పార్టీ పరంగా 42శాతం టికెట్లు ఇచ్చేందుకు ముందుకు రావాలని సవాల్ చేస్తున్నానన్నారు. 2014లో సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు బీసీలు 61శాతం(హిందూ బీసీ 51%+ముస్లిం బీసీ 10%)అని..ఇప్పుడు బీసీల సంఖ్య కులగణన సర్వేలో 46% ఎలా తగ్గిందన్న కేటీఆర్ వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి కొట్టిపారేశారు.
బీసీ రిజర్వేషన్లు మా సర్వేలో 56.33శాతం వచ్చిందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం, అవగాహన రాహిత్యంతో సభలో మాట్లాడం సరికాదని కేటీఆర్ పై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తప్పుల తడక బీఆర్ఎస్ సమగ్ర కుటుంబ సర్వే నివేదికను ప్రజల ముందు, సభముందు పెట్టకుండా లిమ్కా బుక్ రికార్డుకు అందించిన ఘనులని విమర్శించారు. ఎంతకాలం ప్రజలను బీఆర్ఎస్ మోసం చేస్తుందని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం బీసీలకు రిజర్వేషన్లపై చిత్తశుద్ధితో కులగణన ప్రక్రియను నిర్వహించామని స్పష్టం చేశారు.
కులగణన నివేదికలో నాల్గవ విభాగంలో ప్రైవసీ వివరాలు ఉన్నందునా మేం నివేదిక బయట పెట్టలేమన్నారు. ఆ వివరాలు కాకుండా ఏ వివరాలు అడిగినా సభ్యులకు అందిస్తామన్నారు. 1.12శాతం మాత్రమే జనాభా వృద్ధి రేటు ఉందని అందుకే జనాభా పెరుగుదల తక్కువగా కనిపిస్తుందని. అలాగే సర్వేలో పాల్గొనని వారి లెక్కలు కూడా రాలేదని గుర్తు చేశారు. కులగణన సర్వేలో బీసీలు, మైనార్టీల జనాభా శాతం పెరిగిందని స్పష్టం చేశారు. దీనిపై సభ్యులకు వివరాలు అందిస్తామన్నారు. నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక ఎందుకు జనాభా గణన చేపట్టలేదని..బీజేపీ సభ్యులు జనాభా లెక్కించమని మోడీని ఎందుకు అడగడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.






