తెలంగాణలో హామీలకు ఆ ఇద్దరిదే బాధ్యత.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-07 04:20:57  IST  )

తెలంగాణ (Telangana)లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు రేవంత్ రెడ్డి కాదు.. రాహుల్ గాంధీ (Rahul Gandhi), సోనియా గాంధీ (Sonia Gandhi)లు బాధ్యత వహించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) కామెంట్ చేశారు.

తెలంగాణలో హామీలకు ఆ ఇద్దరిదే బాధ్యత.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana)లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు రేవంత్ రెడ్డి కాదు.. రాహుల్ గాంధీ (Rahul Gandhi), సోనియా గాంధీ (Sonia Gandhi)లు బాధ్యత వహించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) కామెంట్ చేశారు. ఇవాళ ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందే అబద్ధాలు చెప్పడం.. అనేక రకాల అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చిందని మండిపడ్డారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలతో ప్రజలకు మోసం చేసి అధికారంలోకి వచ్చిందని అన్నారు. నేడు ఇచ్చిన హామీలను అమలు చేయలేక చేతకాని రేవంత్ సర్కార్ అప్పుల కోసం అర్రులుచాస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సర్వ నాశనం చేస్తోందని కిషన్ రెడ్డి అన్నారు.

తెలంగాణకు రేవంత్ ఒరగబెట్టిందేమీ లేదు..

రాష్ట్రంలో నిరుద్యోగుల యువత కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. నాడు ఎన్నికల సందర్భంగా చేసిన యూత్ డిక్లరేషన్ (Youth Declaration) ఏమైందని ప్రశ్నించారు. అదేవిధంగా మైనార్టీ డిక్లరేషన్ ఎక్కడకు పోయిందని ధ్వజమెత్తారు. బీసీలకు రూ.లక్ష కోట్లు ఇస్తామని ఊదరగొట్టారని ఆరోపించారు. రెండేళ్లలో బీసీల కోసం రూ.40 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉన్నా.. నయా పైసా వారి అభ్యున్నతికి ఖర్చు చేసిన పాపన పోలేదని అన్నారు. ఢిల్లీ (Dehli)కి ప్రదక్షిణలు తప్ప.. రేవంత్ రెడ్డి తెలంగాణకు ఒరగబెట్టిందేమీ లేదని కామెంట్ చేశారు. బీసీ రిజర్వేషన్ల (BC Reservations) విషయంలో తెలంగాణ కాంగ్రెస్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని కిషన్‌రెడ్డి అన్నారు.

సోనియాగాంధీ సమాధానం చెప్పాలి..

బీసీ రిజర్వేషన్ల పేరుతో ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారని కిషన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చి దేశానికి రోల్ మోడల్‌గా నిలవాలని అనకుంటున్నారా అని ఫైర్ అయ్యారు. సోనియా గాంధీ (Sonia Gandhi) కుటుంబాన్ని పొగిడేందుకే నిన్న జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టినట్లుగా ఉందని అన్నారు. కేవలం ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Naredra Modi)ని విమర్శించేందుకు మాత్రమే ఆ ఆందోళన చేపట్టారని పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క డిక్లరేషన్‌ను అమలు చేయలేదని అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నానని తెలిపారు. వెంటనే ఆమె రాష్ట్రపతికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సోనియా గాంధీ కూడా సమాధానం చెప్పాలని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story