- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిండు కుండలా ఆ మూడు ప్రాజెక్టులు.. హెచ్చరికలు జారీ చేసిన అధికారులు
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోయినా.. ఎగుర రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో విస్తరంగా వర్షాలు కురుస్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోయినా.. ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో విస్తరంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జూరాల, శ్రీశైలం, తంగభద్ర ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయానికి ఇన్ ఫ్లో 1,00,085 క్యూసెక్కులుగా ఉండగా.. అవుట్ ఫ్లో 30,726గా కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 874.30 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.7080 టీఎంసీలు కాగా.. 160.5282 టీఎంసీలు నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరింది. దీంతో కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. ఏ క్షణానైనా శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
ఇక జూరాల ప్రాజెక్టుకు క్రమంగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అప్రమత్తైన అధికారులు మొత్తం 11 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రాజెక్ట్‌లోకి ఇన్ ఫ్లో 98,000 క్యూసెక్కులు ఉండగా.. అవుట్ ఫ్లో 1 లక్ష క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీ. కాగా.. ప్రస్తుత నీటిమట్టం..317.270 మీ.గా ఉంది. ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 7.224 టీఎంసీలు నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరింది. జూరాల ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాల్లో 11 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
అదేవిధంగా కర్నూలులోని తుంగభద్ర జలాశాయంలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1,633 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 1,624.38 అడుగులకు చేరింది. ఇన్ ఫ్లో 33,916 క్యూసెక్కులు ఉండగా. అవుట్ ఫ్లో 2,389 క్యూ సెక్కులుగా కొనసాగుతోంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటి నిల్వ 74.486 టీఎంసీలుగా ఉంది.
పర్యాటకులు, స్థానికులకు అధికారుల హెచ్చరికలు
ప్రాజెక్టులలో ఎగువ నుంచి వరుద ప్రవాహం భారీగా పెరుగుతోన్న నేపథ్యంలో దిగువ ప్రజలతో పాటు పర్యాటకులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పరిస్థితిని బట్టి ఎప్పుడైనా ప్రాజెక్టు గేట్లను ఓపెన్ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. నీటి ప్రవాహం పెరిగితే డౌన్ స్ట్రీమ్ ప్రాంతాల్లోని ప్రజలకు ముందస్తుగా సమాచారం ఇవ్వనున్నట్లుగా పేర్కొన్నారు.






