- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BRS Party : ఆ మూడు పార్టీలకు గుణపాఠం తప్పదు : బీఆర్ఎస్ పార్టీ
కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ పార్టీలకు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని బీఆర్ఎస్ పార్టీ(BRS Party) ట్వీట్ చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ పార్టీలకు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని బీఆర్ఎస్ పార్టీ(BRS Party) ట్వీట్ చేసింది. 'ప్రజాభవన్ వేదికగా గురుశిష్యులు భేటీ అయి సరిగ్గా ఏడాది గడుస్తోంది. వీరిద్దరి మధ్య ఉన్న ఫెవికాల్ బంధం తెలంగాణ రైతుల గొంతు కోస్తోంది. తెలంగాణ భవిష్యత్తును అంధకారంలోకి నెడుతోంది' అంటూ పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), చంద్రబాబులపై ఆరోపణలు చేసింది. 'రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఆస్తులు, అప్పుల వివాదాలపై చర్చల పేరిట జరిపిన ఈ భేటీకి ఏడాది గడిచినా కనుగొన్న పరిష్కారాలు మాత్రం సున్నా...!! ఇటీవల ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు తెరపైకి తెచ్చిన బనకచర్ల(Banakacharla) బాగోతానికి కూడా ఏడాది క్రితమే ప్రజాభవన్ వేదికగా పునాది పడినట్టు తేలిపోయింది.
పైకి విభజన చట్టంలోని అంశాలపై చర్చల పేరిట.. లోలోపల కుమ్మక్కు రాజకీయాలు, తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీసేందుకు ఇద్దరూ కలిసి చేస్తున్న పన్నాగాలను చైతన్యానికి ప్రతీకైన తెలంగాణ సమాజం ఎప్పుడో పసిగట్టేసింది. రాజకీయంగా భిక్షపెట్టిన ఏపీ సీఎంకు గురుదక్షణగా తెలంగాణ నీటి హక్కులను, రైతుల ప్రయోజనాలను ఏపీ ముఖ్యమంత్రికి, సీఎం రేవంత్ తాకట్టు పెడితే 70 లక్షల మంది అన్నదాతలు ఊరుకునే ప్రసక్తే లేదు. గోదావరి జలాల్లో తెలంగాణ హక్కులను కాపాడాల్సింది పోయి పక్కరాష్ట్రానికి దోచిపెడుతున్న రేవంత్ రెడ్డిని తెలంగాణ రైతులు ఎప్పటికీ క్షమించరు.
బీఆర్ఎస్ ను, పార్టీ అధినేత కేసీఆర్ ను రాజకీయంగా ఎదుర్కోలేక చీకటి ఒప్పందాలతో చేస్తున్న కుయుక్తులను తిప్పికొట్టేందుకు నాలుగు కోట్ల పిడికిళ్లు సిద్ధంగా ఉన్నాయి. కేంద్రంలో బీజేపీ, పక్కరాష్ట్రంలో టీడీపీ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాలు కలిసి తెలంగాణపై ఏడాది కాలంగా చేస్తున్న మూకుమ్మడి కుట్రలకు ప్రజాక్షేత్రంలోనే గుణపాఠం తప్పదు.' అని మండిపడింది.






