- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bandi Sanjay : ఆ మూడు పార్టీలు ఏకమయ్యాయి : బండి సంజయ్
బీజేపీ కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) హాట్ కామెంట్స్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : బీజేపీ కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) హాట్ కామెంట్స్ చేశారు. సోమవారం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కీలక భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS), ఎంఐఎం(MIM) పార్టీలు ఏకమయ్యాయని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో(MLC Elections) ఎంఐఎం పార్టీని గెలిపించడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏకమై ఆ పార్టీకి సహాయం చేస్తున్నాయని అన్నారు. హైదరాబాద్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఓట్లు ఉన్నా సరే వారికి ఎంఐఎంతో ఉన్న అనుబంధం కారణంగా పోటీ చేయడం లేదన్నారు. ఎంతమంది ఏకమైనా బీజేపీ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరని ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రెస్ సన్నబియ్యం ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారని, కాని అందులో కేంద్రానికి కూడా వాటా ఉందని, ప్రతి కిలోకు రూ.40 చొప్పున కేంద్రం భరిస్తుందని బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏడాదికి రూ.10 వేల కోట్లు ఇస్తోందని.. ఈ విషయాన్ని ఎక్కడైనా తాను నిరూపించేందుకు సిద్ధం అని సవాల్ విసిరారు. ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్నప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో ఎందుకు పెట్టలేదని నిలదీశారు. నిరుద్యోగ అభ్యర్థులకు కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేస్తోందని, గ్రూప్ 1 అభ్యర్థుల అనుమానాలు తీర్చకముందే ఫలితాలు ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. ఏదో హడావిడిగా నియామక పత్రాలు అందజేసి గొప్పలు చెప్పుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి ఆరాటపడుతున్నారని పేర్కొన్నారు.
Read Mlore..
Kishan Reddy: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ నినాదం ఇదే: కిషన్ రెడ్డి






