ఆ ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలి.. ఓయూ బందుకు పిలుపునిచ్చిన ఏబీవీపీ

by Ramesh Goud |
ఆ ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలి.. ఓయూ బందుకు పిలుపునిచ్చిన ఏబీవీపీ
X

దిశ, వెబ్ డెస్క్: ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు (Osmania University Officials) జారీ చేసిన ఉత్తర్వులను (Orders) వెంటనే వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేస్తూ.. ఏబీవీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఓయూ బందుకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆదివారం ఓయూలో నిర్వహించిన మీడియా సమావేశంలో స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ (State Working Member), జిల్లా కన్వీనర్ హరి ప్రసాద్ మాట్లాడుతూ.. ఓయూ అధికారులు జారీ చేసిన ఆంక్షల ఉత్తర్వులపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన.. యునివర్సిటీ వేదికగా విద్యార్థుల సమస్యలను ప్రశ్నిస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. విద్యార్థుల సమస్యలను పరిష్కారం చేయడం సాధ్యం కాక ధర్నాలు చేయొద్దు, ప్రశ్నించవద్దు, నినాదాలు ఇవ్వొద్దు అని జారీ చేసిన ఉత్తర్వులను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (Akhila Bharatha Vidhyardhi Parishad) ఖండిస్తుందని అన్నారు.

అలాగే ఎన్నో ఉద్యమాలకు ఊపిరి పోసి విజయాలను సొంతం చేసుకున్న గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ అంటూ.. అలాంటి ప్రఖ్యాతిగాంచిన యునివర్సిటీలో అధికారులు సమస్యల పరిష్కారాలపై దృష్టి పెట్టేది పోయి అక్రమ దందాల కోసం యూనివర్సిటీ అధికారులు ఇలాంటి ఉత్తర్వులను జారీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక విద్యార్థుల సమస్యలపైన ప్రశ్నించొద్దు అని విద్యార్థుల గొంతును నొక్కుతూ కాంగ్రెస్ నాయకుల (Congress Leaders) కండువా కప్పుకొని పనిచేస్తున్న యూనివర్సిటీ అధికారులు (University Officials) వెంటనే జారీ చేసిన ఉత్తర్వులని ఉపసహరించుకోవాలని డిమాండ్ (Demand) చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ బందుకు పిలుపునిస్తున్నట్లు ఓయూ ఏబీవీపీ నాయకులు తెలిపారు.




Next Story

Most Viewed