రాజ్‌భవన్‌కు చేరిన ఆ ఐదు బిల్లులు.. న్యాయ సలహా కోసం గవర్నర్ సిఫారసు

by Kema Shiva Kumar |

తెలంగాణ శాసనసభ సమావేశాలు వాడీవేడిగా కొనసాగాయి.

రాజ్‌భవన్‌కు చేరిన ఆ ఐదు బిల్లులు.. న్యాయ సలహా కోసం గవర్నర్ సిఫారసు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ శాసనసభ సమావేశాలు వాడీవేడిగా కొనసాగాయి. ప్రధానంగా కాళేశ్వరం నివేదిక (Kaleshwaram Report)పై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. శానసమండలితో పాటు శాసనసభలో ప్రభుత్వం మొత్తం ఐదు బిల్లులను ప్రవేశపెట్టింది. బీసీ‌లకు స్థానిక సంస్థల్లో ఉన్న 50 శాతం నిబంధన ఎత్తివేస్తూ.. రిజర్వేషన్లను పెంచుతూ అసెంబ్లీ (Assembly)లో ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ సవరణ బిల్లు (Panchayat Raj Amendment Bill) ఏకగ్రీవ ఆమోదం పొందింది. పురపాలక చట్ట సవరణ బిల్లు (Municipal Act Amendment Bill)కు కూడా సభ ఏకగ్రీవంగా ఓటేశారు. ఇక అల్లొపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ బిల్లు (Allopathic Private Medical Care Establishments Bill)కు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

సంగారెడ్డి జిల్లాలో ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీల ఏర్పాటు, ఇస్నాపూర్ మున్సిపాలిటీ విస్తరణ చేస్తూ మంత్రి సీతక్క ప్రవేశపెట్టి బిల్లులు ఉభయ సభలో ఆమోదం పొందాయి. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా అసెంబ్లీతో పాటు మండలిలో ఆమోదించిన మొత్తం ఆ ఐదు బిల్లులు రాజ్ భవన్‌కు చేరాయి. అయితే, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Governor Jishnu Dev Verma) వాటిని ఆమోదించే ముందు న్యాయ సలహా తీసుకోవాలని నిర్ణయించినట్లుగా సమాచారం. గవర్నర్ ఐదు బిల్లులకు ఆమోదం తెలుపుతారా.. లేక తిరిగి వెనక్కి పంపుతారా అని ప్రభుత్వ వర్గాల్లో ఉత్కంఠగా మారింది.

Next Story