- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ ఏడాది తెలంగాణలో భారీ వర్షాలు: ఐఎండీ
తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఊహించింన సమయం కంటే ఈ ఏడాది ముందుగానే రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ఎంటర్ అయ్యాయని పేర్కొంది.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఊహించింన సమయం కంటే ఈ ఏడాది ముందుగానే రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ఎంటర్ అయ్యాయని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని ఈ రోజు తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలోకి ప్రవేశించాయన్నారు. 12 నుండి 13 రోజులు ముందుగానే నైరుతి పవనాలు ఎంటర్ అయ్యాయని చెప్పారు. దీని ప్రభావంతో ఈ ఏడాది భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. గతేడాది మాదిరిగానే సగటు కంటే అధిక వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు.
2020లో కూడా ఇదే విధంగా ముందుగానే రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు వచ్చాయని అన్నారు. ఆ సంవత్సరం భారీ వర్షాపాతం నమోదైందని చెప్పారు. ఈ ఏడాది కూడా అలానే ఉండే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం దక్షిణ తెలంగాణలోకి ఎంటర్ అయిన రుతుపవనాలు పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఉత్తర తెలంగాణలోకి కూడా ప్రవేశించే అవకాశం ఉందన్నారు. ఈ రోజు నుండి రాబోయే నాలుగు రోజుల పాటూ తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఈరోజు ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, ఉమ్మడి మహబూబ్ నగర్, వనపర్తి, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.






